Social News XYZ     

Dandupalyam 4 movie will be released in 5 languages

 * 'దండుపాళ్యం 4' : 5  భాషల్లో విడుదల
 * దండు ను తయారు చేసే నాయకుడి పాత్రలో
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ'

Dandupalyam 4 movie will be released in 5 languages

'దండుపాళ్యం-4  విడుదలకు ముస్తాబవుతోంది. దండుపాళ్యం సిరీస్ లో తొలి చిత్రాల విజయాలు దండుపాళ్యం-4  పై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు వ్యాపార వర్గాలలోనూ ఆసక్తిని మరింత పెంచేలా చేశాయి. సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా వెంకట్ మూవీస్ పతాకంపై  కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

*దండు ను తయారు చేసే నాయకుడి పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ'
ఈ చిత్రంలో దండు ను తయారు చేసే నాయకుడి గా ప్రధాన పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ' నటిస్తున్నారు. ఇప్పటికే తాను ఈ చిత్రం లో పోషిస్తున్న  పాత్ర షూటింగ్ పూర్తయిందని, నటుడిగా తనకిదో వైవిధ్యమైన పాత్ర అని బెనర్జీ తెలిపారు. గత చిత్రాలకన్నా భిన్నంగా 'దండుపాళ్యం-4' రూపొందుతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రం లో తమ దండు చేసే పోరాటాలు,తన పాత్ర తో సహా, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రం లోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. మంచి విజన్ వున్న దర్శకుడు  కె.టి.నాయక్ . నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పతాక సన్నివేశాలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. నిస్సందేహంగా ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర ప్రశంసలకు గురవుతుందని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి 'దండుపాళ్యం' మొదటి,రెండు,మూడు చిత్రాలకు  ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందుతోంది. ఇందులో  ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు.. ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని దర్శకుడు చెప్పారు. 40 మంది గ్యాంగ్ లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథకరచనతోనే ఈ సినిమా రూపొందుతోందని ఆయన వివరించారు. వైవిధ్యమైన  పాత్రలను వెండితెరపై పోషించి తన ప్రతిభను చాటుకున్న సుమన్ రంగనాథన్ 'దండుపాళ్యం-4'లోనూ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు.పాత్ర నచ్చడం, కథలోని వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, సుమా రంగనాథన్ చెబుతున్నారు.

* 'దండుపాళ్యం 4' :  5  భాషల్లో విడుదల 

దాదాపు చిత్రం  షూటింగ్ పూర్తి చేసుకుంది, సెప్టెంబర్ లో  దండుపాళ్యం-4' ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత వెంకట్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఎన్నో సరికొత్త ప్రదేశాలలో ఈ చిత్రం లోని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కెమెరామన్ గిరి ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అన్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని  నిర్మాత కె.టి. నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో  విడుదల చేయనున్నారు.

చిత్రం లోని ప్రధాన తారాగణం: సుమన్ రంగనాధ్, బెనర్జీ, రాక్ లైన్ సుభాకర్, రామ్ దుర్గ, జీవ సిమన్, స్నేహ, రిచా శాస్త్రి , సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ.

కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, ఎడిటర్: బాబు.ఎ. శ్రీ వాత్సవ్,ప్రీతి మోహన్, సాహిత్యం: భువనచంద్ర, నృత్యాలు: హరికృష్ణ.

నిర్మాణ సంస్థ: వెంకట్ మూవీస్
దర్శకత్వం: కె.టి.నాయక్

నిర్మాత: వెంకట్

Facebook Comments
Dandupalyam 4 movie will be released in 5 languages

About uma

%d bloggers like this: