Social News XYZ     

Udyama Simham, A movie with Telangana movement as backdrop launched

తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!

Udyama Simham, A movie with Telangana movement as backdrop launched

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కేసీఆర్‌ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్‌ నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు నాజర్‌ మాట్లాడుతూ…‘‘నేను ఇప్పటి వరకు ఐదు వందల సినిమాల్లో నటించాను. హిస్టారికల్‌, ఫిక్షన్‌ ఇలా పలు రకా ల పాత్రల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి..గెలిచిన కేసీఆర్‌ గారి పాత్రలో నటించడం పట్ల చాలా ఎమోషనల్‌గా ఫీ లవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. ఈ పాత్ర కోసం దర్శక, నిర్మాత లు నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌గారు గ్రేట్‌ ఫైటర్‌. నాకున్న అనుభవాన్నంతా ఈ పాత్ర కోసం పెట్టి…పూర్తి న్యాయం చేయా లన్న సంకల్పం తో ఉన్నాను. ఇప్పటికే కేసీఆర్‌ గారి వీడియో లు చాలా చూశాను. ఇంకా చూస్తాను. ఆయన ప్రతి మాటలో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అలాగే కేసీఆర్‌గారి గురించి సంబంధించిన పుస్తకాలు కూడా చదువుతున్నా’’ అన్నారు.

నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ…‘‘ కేసీఆర్‌ గారు పత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం దగ్గర నుంచి బంగారు తెంగాణాగా తీర్చిదిద్దే క్రమం వరకు ఈ సినిమా ఉంటుంది. స్క్రిప్టు బాగా వచ్చింది. ఈ సినిమా అన్ని ప్రాంతా ల వారికి నచ్చే విధంగా, స్ఫూర్తి నింపేలా ఉంటుంది. నవంబర్‌ 29 న రిలీజ్‌ చేయడానికి సన్నాహా లు చేస్తున్నాం’’ అన్నారు.

దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ…‘‘కేసీఆర్‌గారి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. కానీ, నాజర్‌ గారైతే పర్‌ఫెక్ట్‌గా సూటవుతారని వారిని తీసుకున్నాం. నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతకు, నాజర్‌ గారికి నా ధన్యవాదాలు ’’ అన్నారు.

రచయిత కాంచనపల్లి రాజేందర్‌ మాట్లాడుతూ…‘‘కేసీఆర్‌గారు చేసిన ఉద్యమం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి ఉద్యమ నేపథ్యంలో ఈ ఉద్యమ సింహం వస్తోంది. నాజర్‌గారు ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగ లరన్నది మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు.

నాజర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్‌:నందమూరి హరి, ఆర్ట్‌: హరిబాబు, కెమెరా: ఉదయ్‌కుమార్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి, సహ నిర్మాత: మేకా రాఘవేంద్ర, నిర్మాత: కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు.

Facebook Comments
Udyama Simham, A movie with Telangana movement as backdrop launched

About uma