Sumanth’s Idam Jagath movie first look released

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ విడుదల

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ..  ''సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.  ఈ పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 'ఇదం జగత్' టైటిల్‌కు చక్కని స్పందన వచ్చింది. హీరో పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం..'' అన్నారు.

శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%