యు. కె నుండి సినిమాలపై ఇష్టం తో వచ్చేసా.... బిక్స్ ఇరుసడ్ల
ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం కన్నుల్లో నీ రూపమే
. నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించారు. జూన్29న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు భిక్షపతి (బిక్స్) చెప్పిన విశేషాలు...
హాయ్ బిక్స్ గారు
హాయ్ అండి..
మీకు ఆ పేరు ఎలా వచ్చింది?
నా పూర్తి పేరు బిక్షపతి, నేను యు.కే లో వున్నప్పుడు అక్కడ నా పూర్తి పేరు పలకలేక అందరు బిక్స్, బిక్స్ అని పిలిచేవారు, అదే నా స్క్రీన్ నేమ్ అయిపోయింది.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటినుండి కవితలు, కధలు రాయటం చాలా ఇష్టం, ఆ ఇష్టమే నన్ను ఈ సినిమా కి దర్శకుడ్ని చేసింది. ఈ సినిమా నిర్మాత భాస్కర్ భాసాని గారు నాకు మిత్రుడు.ఈ కథ ని నన్ను నమ్మి ఈ సినిమా కి నిర్మించటానికి ముందుకు రావటం జరిగింది.
ఎటువంటి కథ ని ఎన్నుకొన్నారు?
ఇది ఒక హృద్యమైన ప్రేమ కథ. మనం ఎటువంటి కష్టం లో వున్నా జీవితం లో ముందుకు సాగిపోవాలే తప్ప వెనుతిరిగి పోకూడదనే సందేశాన్ని, ఒక ప్రేమ కథతో అంతర్లీనంగా చెప్పదలుచుకొన్నా..
నటీనటుల గురించి?
నందు ఇంతవరకు ఏ సినిమాలో చెయ్యని మంచి క్యారెక్టర్ చేసారు. నటన లోనే కాకుండా డాన్స్ ల్లోను నందు బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చ్చారు. ఇక కథానాయక తేజస్విని ప్ర తేజస్విని ప్రకాష్ గురించి చెప్పాలంటే ఆమె నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది. కాష్ గురించి చెప్పాలంటే ఆమె నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది.
ఏ ధైర్యం తో కొత్త్త సంగీత దర్శకుడ్ని తీసుకొన్నారు?
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, నాకు facebook ద్వారా మా సంగీత దర్శకుడు సాకేత్ పరిచయం అయ్యారు, నేను నా స్టోరీ అతనికి చెప్పటం, సినిమా లో సంగీతానికి వున్న ఇంపార్టెన్స్ చెప్పటంతో అతను కూడా చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఆలా మా ప్రయాణం మొదలయ్యింది.సాకేత్ కి ఇది మొదటి సినిమానే అయినా చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు.
మీ కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం ఎలా వుంది?
నా కుటుంబసభ్యులు మరియు నా స్నేహితుల సహకారం ఎప్పటికి మరువలేనిది.
మీరు ఈ సినిమా ద్వారా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకొంటున్నారా?
నన్ను అనుక్షణం వెన్నంటే ఉండి, నా ఎదుగుదలను ఆకాంషించే మా నాన్న గారే నా రియల్ హీరో, ఆయనకే నా కృతజ్ఞతలు.
చిన్న సినిమాలు విడుదల చేయటం కష్టం కదా, మీరు ఎలా చేస్తున్నారు?
మా పి.ఆర్.ఓ రాంబాబు ద్వారా హరి హర చలన చిత్ర నిర్మాతలు రామ మోహన్ రావు ఇప్పిలి , ఎస్ శ్రీకాంత్ రెడ్డి పరిచయం అయ్యారు. మా సినిమాని చూసి మెచ్చి విడుదల చెయ్యటానికి పెద్ద మనసుతో ముందుకొచ్చిన వాళ్లకు నా కృతజ్ఞతలు.
చివరగా ప్రేక్షకుడు మీ సినిమా ఎందుకు చూడాలి?
ఇది ప్రేక్షకుడ్ని ఆలోచింప చేసే సినిమా. 6 నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు రెండు గంటలు తనని తాను మైమరచిపోయి ఆనందించే సినిమా.