Aamani talks about “IPC Section Bharya Bhandhu” movie

పెళ్లయినవాళ్ళే కాదు.. పెళ్లి కావాల్సినవాళ్లూ
తప్పక చూడాల్సిన చిత్రం 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు'
-'మిస్టర్ పెళ్ళాం' ఆమని

ఆమని అనగానే మొదట 'మిస్టర్ పెళ్ళాం' గుర్తొస్తుంది. ఆ తర్వాత 'శుభలగ్నం, శుభ సంకల్పం, శుభప్రదం. ఘరానా బుల్లోడు, జంబలకిపంబ' వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు మదిలో మెదులుతాయి. రీసెంట్ గా మహేష్ బాబు తో 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ లో నటించి మెప్పించిన ఈ అందాల భామ ప్రత్యేక ముఖ్య పాత్రలో నటించిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' ఈంల 29న విడుదల కానుంది.శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు ఆమని. పెళ్లయినవాళ్లతోపాటు, పెళ్లికావాల్సినవాళ్లంతా తప్పక చూడాల్సిన సినిమా 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' అని ఆమె అంటున్నారు.

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' లో నటించమని నన్ను అడిగినప్పుడు మొదట నేను సంకోచించాను. పెద్ద హీరోల సినిమాలు చేస్తూ.. కొత్త హీరో సినిమా చేయడం ఎందుకని అనుకున్నాను. కానీ ఈ సినిమా చేయకపోతే ఒక నటిగా మంచి సినిమా మిస్ అయి ఉండేదాన్ని. అంత మంచి సినిమా 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు'. వివాహ బంధంలో గొప్పతనం తెలుసుకోక.. చాలా చిన్న చిన్న కారణాలకే ఈ రోజుల్లో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఈ చిత్రంలో నేను స్వాతి శ్రీపాద అనే రైటర్ కమ్ కౌన్సిలర్ గా నటించాను. ఇందులో నాకు ఒక పాట కూడా ఉంది. పెళ్లి నేపథ్యంలో ఈ పాట వస్తుంది. పెళ్లి నేపథ్యంలో వచ్చే పాటల్లో టాప్ టెన్ లో ఇది కూడా ఉంటుంది. పాత వినడానికి, చూడడానికి అంత బాగుంటుంది ఈ పాట. డైరెక్టర్ శ్రీవివాస్ రెట్టాడి ప్రతి సన్నివేశాన్ని ఏంటో హృద్యంగా చిత్రీకంరించారు. నిర్మాత ఆలూరి సాంబశివరావుగారికి సినిమా అంటే పేషన్ తో పాటు మంచి అవగాహన కూడా ఉంది. ఆయన పెద్ద నిర్మాత అవుతారని నా నమ్మకం. అలాగే ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న శరత్ చంద్రకు కూడా మంచి భవిష్యత్ ఉంది. చాల బాగా చేశాడు. చక్కని సందేశానికి చిక్కని వినోదం జోడించి రూపొందించిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆలూరి క్రియేషన్స్ నుంచి ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావాలని, వాటిలో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను!!

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%