Lotus 2018 Short Film Awards are presented by Tammreddy Bharadwaja & Raj Kandukuri

తమ్మారెడ్డి,రాజ్ కందుకూరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా లోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

ప్రముఖసంస్థ లోటస్ ఫిల్మ్ అవార్డ్స్3 వ వార్షికోత్సవం సందర్భంగా హైదరబాద్ లోని ప్రసాద్ లాబ్స్  లోలోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అత్యంత వైభవంగాజరిగింది.

ప్రముఖదర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, జాతీయ అవార్డ్ గ్రహీత,నిర్మాత రాజ్ కందుకూరి, రాజ్ముదిరాజ్,గాయత్రి గుప్త మరియి ప్రముఖులసమక్షంలో జరిగిన ఈ వేడుకలో డాక్టర్ఆనంద్ “చిరు తేజ్ సింగ్”చిత్రానికి గాను,ఉత్తమదర్శకునిగా అవార్డ్ ని తీసుకోవడం జరిగింది.

అలాగేఉత్తమ బాల నటిగా 9 సంవత్సరాలవయసులోనే ఒక నిమిషంలో 125 దేశాలనుగుర్తించి ప్రపంచ రికార్డ్ లను  సొంతంచేసుకున్న చిరు తేజ్ సింగ్కు లభించడం విశేషం.

ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ,చిరు తేజ్ సింగ్మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించినలోటస్ యాజ మాన్యానికి,నిర్మాతయన్.యస్ నాయక్ గారికి,హీరోయిన్ మనాలీ రాథోడ్,సౌమ్యవేణు గోపాల్ గారికి ధన్య వాదాలు తెలియచేసారు.

అలాగేవివిధ కేటగీరీలలో ఒక్క క్షణం, మంగమ్మగారి మనవడు,నా కథ,మర్డర్, అలనాటి రామ చంద్రులు, సంద్రం,ఆలు ఫ్రై ,సూర్య భాయి,తరుణం,బీప్ తదితర చిత్రాలుఅవార్డ్ లను దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మరియు రాజ్ కందుకూరిమాట్లాడుతూ,కొత్త టాలెంట్ నుప్రోత్సహించే లోటస్ లాంటి సంస్థలుఇంకా ముందుకు రావాలని,రేపటి తెలుగు చిత్రపరిశ్రమను శాసించేది నేటి లఘు చిత్రదర్శకులే అని నిర్వాహకురాలైన నళినిగారిని కొనియాడడం జరిగింది.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%