Social News XYZ     

I Liked ‘Abhimanyudu’ A Lot – Youth Star Nithiin

Mass Hero Vishal, Samantha, Action King Arjun starrer 'Abhimanyudu' introducing PS Mithran as Director Produced by Vishal Film Factory, Hari Venkateswara Pictures by G.Hari is emerged as biggest hit in Vishal's career. 'Abhimanyudu' which is mainly based on Cyber Crimes narrated with engaging screenplay is winning accolades from all sections. Youth Star Nithiin praised the film via his Twitter account....

"Watched 'Abhimnayudu'...liked the film a lot...superb performances from Vishal, Arjun sir, Samantha n Dir Mithran take a bow for coming up with a superb script and gripping screenplay..and congrats to the entire cast and crew and producer Hari"

Mass Hero Vishal Responded to Nithiin's tweet, "Thank You Darling bro Nithiin. Glad you liked the film.God Bless".

 

Young Producer G.Hari says, " Thanks to Youth Star Nithiin for appreciating our film 'Abhimanyudu'. Film has collected 18 crores in 18 days and emerged as Biggest hit in Vishal's career. I am very happy that film is running with very good collections in its third week too."

అభిమన్యుడు చాలా నచ్చింది - యూత్ స్టార్ నితిన్

మాస్ హీరో విశాల్ హీరో గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో పి.ఎస్. మిత్రన్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ సంయుక్తంగా జి.హరి నిర్మాతగా నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. సైబర్ నేరాల వంటి ఆసక్తికరమైన అంశం తో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన 'అభిమన్యుడు' విశాల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. 18 రోజులకి 18,15,72,548 గ్రాస్ వసూలు చేసి మూడవ వారం లో కూడా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.

'అభిమన్యుడు' మంచి వసూళ్ళతో పాటూ, అనేక మంది సెలెబ్రిటీల ప్రశంసలూ దక్కించుకోవడం విశేషం. తాజాగా యూత్ స్టార్ నితిన్ 'అభిమన్యుడు' ని ప్రశంసించారు. ఆయన అభిప్రాయాన్ని ప్రత్యేకంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.....

" 'అభిమన్యుడు' ని చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. విశాల్, అర్జున్ సార్, సమంత ల నటన, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో పాటూ ఉత్కంఠ రేపే స్క్రీన్ప్లే తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హరి కి, చిత్ర బృందానికి అభినందనలు"

దీనికి మాస్ హీరో విశాల్ స్పందిస్తూ, " థాంక్స్ బ్రదర్. నీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది" అని స్పందించారు

యువ నిర్మాత జి.హరి మాట్లాడుతూ, " 'అభిమన్యుడు' ని అభినందించిన యూత్ స్టార్ నితిన్ కి కృతజ్ఞతలు. 18 రోజులకి 18 కోట్లు వసూలు చేసి విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మూడవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ సాధించడం ఆనందంగా ఉంది." అన్నారు

Facebook Comments
I Liked 'Abhimanyudu' A Lot - Youth Star Nithiin

About uma