మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో విడుదలవుతున్న `తేజ్ ఐ లవ్ యు` డెఫనెట్‌గా హిట్ అవుతుంది - క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ అధినేత కె.ఎస్.రామారావు
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం జూలై 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో ఈ చిత్ర ఆడియో సక్సెస్ మీట్ జరిగింది.
ఈ కార్యక్రమంలో... క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ అధినేతకె.ఎస్.రామారావు మాట్లాడుతూ - నేను నిర్మాతగా మారడానికి కారణం.. వైజాగే. ఎందుకంటే వైజాగ్‌లో బాలచందర్‌గారి `మరో చరిత్ర` చూసి నిర్మాతగా మారితే వైజాగ్‌లోనే తీయాలని అనుకున్నాను. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే.. నా మొదటి చిత్రం `అభిలాష` సినిమా చేశాను. విశాఖ అందాలతోనే `అభిలాష` సినిమా బాగా వచ్చింది. అలా నా సినిమాల్లో `స్వర్ణకమలం, చాలెంజ్, ముత్యమంత ముద్దు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` సినిమాలు చేశాను. ఇకపై కూడా వైజాగ్‌లో సినిమాలు చేస్తాను. ఇక `తేజ్` సినిమా చేసేటప్పుడు వేసవి కావడంతో షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే చేయాల్సి వచ్చింది. సాయిధరమ్ తేజ్.. అప్పట్లో చిరంజీవిగారికున్న ఎనర్జి తనలో ఉంది. తను వేసవి అయినప్పటికీ ఎంతో గొప్పగా సహకారం అందించారు. అలాగే తేజు ఇన్‌స్పిరేషన్ తర్వాత అనుపమ ఎంతో కష్టపడింది. పూర్తి సహకారం అందించారు. దర్శకుడు ఎ.కరుణాకరన్ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. మంచి కుటుంబ కథాచిత్రం.. అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉంటుంది. కథకు తగిన విధంగా గోపీసుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. మా బ్యానర్‌లో జూలై 6న విడుదలవుతున్న ఈ సినిమా డెఫనెట్‌గా హిట్ అవుతుందని నమ్ముతున్నాను
అన్నారు.
చిత్ర దర్శకుడు ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ - నాకు సినిమా లైఫ్ ఇచ్చింది నా అన్నయ్య పవన్ కల్యాణ్. ఆరోజు `తొలిప్రేమ` చిత్రాన్ని అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో.. అంతే బాగా ఈరోజు నా తమ్ముడు సాయిధరమ్ `తేజ్` చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. మరో 20 సంవత్సరాలు తర్వాత కూడా తేజ్ సినిమా గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు తొలిప్రేమ అయితే ఇప్పుడు తేజ్ ఐలవ్‌యు. అందరికీ నా కృతజ్ఞతలు
అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ - నాకు, వైజాగ్‌కి మధ్య పెద్ద లవ్‌స్టోరీ ఉంది. ఆ లవ్‌స్టోరీ పేరు `ఉన్నది ఒక్కటే జిందగీ`. ఆ సినిమాను ఇక్కడే 25 రోజుల షూట్ చేశాం. ఇక్కడ బీచ్, ఫుడ్ అన్ని బాగా ఇష్టపడ్డాం. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌కి చాలా థాంక్స్. `తేజ్` సినిమా గురించి మాట్లాడాలంటే కె.ఎస్.రామారావుగారి గురించి మాట్లాడాలి. ఆయన ఈ సినిమాతో నాకు మరో మంచి అవకాశాన్ని ఇచ్చారు. డైరెక్టర్‌గారి `తొలిప్రేమ` చిత్రానికి నేను పెద్ద అభిమానిని. సాయిధరమ్ వండర్‌ఫుల్ కోస్టార్. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా ప్రేమతో చేసిన సినిమా. క్యూట్ లవ్ స్టోరీ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది
అన్నారు.
సత్యానంద్ మాట్లాడుతూ - నా మొదటి శిష్యుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఆయన స్టార్ కావడం వల్లే నేను పెద్ద మాస్టర్ అయ్యాను. చాలా మందికి శిక్షణ ఇచ్చాను. అలాంటి వారిలో మెగా హీరోలున్నారు. వారిలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిఫ్యామిలీ వల్ల నేను వృద్ధిలోకి వచ్చాను. క్రమంలో కె.ఎస్.రామారావు, కె.రాఘవేంద్రరావు వంటి వారి సహకారం లభించింది. ఇప్పటి వరకు నేను 107 మంది హీరోలను తయారు చేశాను. 70 మంది ఆర్టిస్టులు తయారు చేశాను. 177 మంది ఇండస్ట్రీలో ఉన్నారు. కరుణాకరన్‌గారు పవన్‌కల్యాణ్‌గారితో `తొలిప్రేమ` సినిమా చేశారు. ఇప్పుడు తేజ్‌తో తేజ్ ఐలవ్‌యు సినిమా చేశారు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది
అన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - తేజ్` పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దొరుకుతుంది. హీరో, హీరోయిన్ , డైరెక్టర్, నిర్మాత కె.ఎస్.రామారావుగారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. భవిష్యత్‌లో సినిమాలు చేసే దర్శకులు వైజాగ్‌లో కొంత భాగాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. గతంలో బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావుగారు ఇక్కడ సినిమాలు చేశారు. సింగిల్ విండో క్లియెరెన్స్ సిస్టమ్ ప్రపోజల్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం
అన్నారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - నేను వైజాగ్‌లోనే సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్నాను. నాకు అప్పటి నుండి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. కరుణాకరన్‌గారు లవ్‌స్టోరీస్ తీయడంలో సిద్ధహస్తులు. మా `తేజ్` సినిమాను కూడా చక్కగా తీశారు. యూత్, కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు చేసిన నాకు ఈ చిత్రం ఓ ఇమేజ్ మేకోవర్ అవుతుంది. పెద్ద బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్ లో రామారావుగారు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. అనుపమ నేచురల్ పెర్ఫామర్. గోపీసుందర్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా ముగ్గురు మావయ్యలు కారణంగానే నేను ఈ స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. అలాగే మెగాభిమానులు చూపించే ప్రేమను మరచిపోలేను
అన్నారు.
This website uses cookies.