Veera Bhoga Vasantha Rayalu movie completes shooting

షూటింగ్ పూర్తి చేసుకున్న  మల్టీస్టారర్ చిత్రం "వీర భోగ వసంత రాయలు"

నారా రోహిత్‌, శ్రీయా శర‌ణ్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. అలాగే న్యూ వేవ్ డైరెక్టర్ ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  హైద్రాబాద్ తో సహా న్యూఢిల్లీ, ఆగ్రా, ముంబై, చెన్నై, పరిసర ప్రాంతాల్లో, జరిగిన ఆఖరి షెడ్యూల్ లో సినిమా పూర్తయ్యింది. ఇంకా ఎలాంటి ప్రచారార్భాటాలు లేకుండా షూటింగ్ జరిగినా కూడా హిందీ మరియు తెలుగు శాటిలైట్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ నెల చివరి వారం జులై మొదటివారంలో టీజర్ ట్రైలర్ విడుదల చేస్తారు. ట్రైలర్ విడుదల చేసిన రోజే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత అప్పారావు బెల్లాన తెలిపారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఇంద్ర‌సేన నాకు చాలా మంచి మిత్రుడు. ఆయ‌న నాకు ఈ క‌థ చెప్పగానే మైండ్ బ్లో అయింది. చెప్పిన‌ వెంట‌నే ప్రొడ్యూస్ చేద్దామ‌నిపించింది. అలాగే ఈ క‌థ‌కి కాస్టింగ్ కూడా క‌థ లానే వైవిధ్యంగా వుండాలనే నారా రోహిత్‌, శ్రీయా శర‌ణ్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ఈ కథకు అనుకున్నాం.

అందరూ కథ విన్న‌వెంట‌నే చేద్దామ‌ని చెప్పారు. ఈ నాలుగు పాత్ర‌ల్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఏ చిత్రంలో  ఎవ్వరూ చెయ్య‌ని విధంగా ద‌ర్శ‌కుడు ఇద్ర‌సేన తీర్చిదిద్దాడు. ఏ పాత్ర‌కి మ‌రో పాత్ర‌కి పోలిక వుండ‌దు. టైటిల్ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ వీర భోగ వసంత రాయలు అనే టైటిల్ ఫిక్స్ చేశాం. అలాగే టెక్నిషియ‌న్స్ విష‌యంలో కూడా ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము.

హైద్రాబాద్ తో సహా న్యూఢిల్లీ, ఆగ్రా, ముంబై, చెన్నై, పరిసర ప్రాంతాల్లో, జరిగిన ఆఖరి షెడ్యూల్ లో సినిమా పూర్తయ్యింది. ఇంకా ఎలాంటి  ప్రచారార్భాటాలు లేకుండా షూటింగ్ జరిగినా కూడా హిందీ మరియు తెలుగు శాటిలైట్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ నెల చివరి వారం జులై మొదటివారంలో టీజర్ ట్రైలర్ విడుదల చేస్తారు. ట్రైలర్ విడుదల చేసిన రోజే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అని అన్నారు

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్ లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ స్టోరీ. నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు -  నారా రోహిత్, సుధీర్ బాబు,  శ్రీ విష్ణు, శ్రీయా సరణ్,  శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాస రెడ్డి, భద్రమ్, శషాంక్ మౌళి, రవి ప్రకాష్, ఛరిత్, రాజేశ్వరి, సునిత వర్మ, శశిధర్, ఏడిద శ్రీరామ్, తదితరులు

సాంకేతిక నిపుణులు
సంగీతం - రాబిన్
కెమెరా -  వెంకటేశ్వర్లు
యాక్షన్ - రామ్ సుంకర
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవ్ నాయర్
నిర్మాత - అప్పారావు బెల్లాన
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - ఇంద్రసేన. ఆర్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%