Social News XYZ     

Nara Rohit to do a film in Sri Shanka Chakra Films

శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ లో నారా రోహిత్‌ !!

Nara Rohit to do a film in Sri Shanka Chakra Films

నారా రోహిత్‌, కృతిక , నీలమ్‌ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా  శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై కార్తికేయను దర్శకుడుగా పరిచయం చేస్తూ కోటి తూముల  నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం`2 చిత్రం   షూటింగ్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు  జరుపుకుంటోంది.

 

ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ...‘‘ఇటీవల  చిత్ర ప్రధాన తారాగణం నాగబాబు, షాయాజీ షిండే, రోహిణి, రఘుబాబు, పోసాని, ఆలీ, కాశీవిశ్వనాథ్‌, పింకీ, ప్రభాస్‌ శ్రీను, సత్యం రాజేష్‌, సుమన్‌ శెట్టి, మహాజన్‌ తదితరులు  పాల్గొనగా పతాక  సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. టర్కీలో రెండు పాటలు  గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశాం. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌ న్యూలుక్‌లో కనిపించనున్నారు.  డైరెక్టర్ చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమా తీశారు. అలాగే అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.  స్టోరీ కి తగ్గట్టుగా ఎక్కడ రాజీ పడకుండా నిర్మించాము. నారా రోహిత్ గారి కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలుస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్స్ అందరూ  చాలా కోపరేట్ చేసారు.  ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు  ప్రారంభమయ్యాయి `` అన్నారు

నాగబాబు, రోహిణి, పోసాని, కాశీవిశ్వనాథ్‌, రఘుబాబు, అలీ, షాయాజీ షిండే, సత్యం రాజేష్‌, ప్రభాస్‌ శ్రీను, సుమన్‌ శెట్టి, పింకీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా:శివేంద్ర, సంగీతం: అనూప్‌రూబెన్స్‌, ఎడిటింగ్‌: ఎమ్‌ఆర్‌ వర్మ,  నిర్మాత: కోటి తూముల,  కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:కార్తికేయ.

Facebook Comments
Nara Rohit to do a film in Sri Shanka Chakra Films

About uma