30లక్షల వ్యూస్‌తో `శంభో శంకర` టీజర్ హవా
కాలకూట విషాన్ని కంఠంలో పెట్టుకుని మృత్యువును జయించిన ఆ పరమశివుడి పేరు పెట్టుకున్న శంకరుడినిరా!.. చావు లేదు..!! అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు శంకర్ అలియాస్ శంభో శంకర. షకలక శంకర్‌గా తెలుగు లోగిళ్లకు పరిచయస్తుడైన శంకర్ కామెడీలోనే కాదు హీరోయిజంలోనూ సత్తా చాటేందుకు .. తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కోరుతూ థియేటర్లలోకి వస్తున్నాడు. కమెడియన్లు హీరోలు అయితే అంగీకరించని వాళ్లుంటారు. కానీ శంకర్ రాకను మాత్రం ఎందరో స్వగతిస్తున్నారు. అయితే అందుకు కారణం శంభో శంకర
టీజర్‌తో అతడు ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. చూడగానే మనసులో ముద్ర పడిపోవాలి. ఆ ముద్ర వేయడంలో శంకర టీజర్ పనితనం చూపించింది. ఎందరు కమెడియన్లు ఉన్నా.. తనకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజమ్స్‌తో టీజర్ ఆద్యంతం శంకర్ రక్తి కట్టించాడు. మాసిజం.. రొమాన్స్.. హాస్యం.. ఎమోషన్.. ఫైట్స్ ఇన్నిటిని కలగలిపి అతడు చూపించిన ఆహార్యం వీక్షకుల్ని కట్టిపడేస్తోంది.
పువ్వులు ఎంతందంగా ఉంటాయో అమ్మాయిలు నవ్వితే అంతందంగా ఉంటార్రా...అంటూ రొమాంటిక్ యాంగిల్‌ని ఎలివేట్ చేశారు. ఆయన ఘరానా మొగుడైతే... నేను నీ మొగుడునా?.. అంటూ వినయవిధేయతలతో మెగాభిమానుల ఆశీస్సులు కోరాడు. పొలిమేరలో పాతేద్దామని మనుషుల్ని పంపావు కదూ.. అదే పొలిమేరల్లో ఆళ్లనే పాతేశానురా! అంటూ నందమూరి నటసింహా బాలకృష్ణ అభిమానుల్ని ఆశీర్వదించమని కోరాడు. ఇదంతా ఒకే ఒక్క టీజర్‌లో శంకర్ చూపించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఇప్పటికే టీజర్ రిలీజైన మూడు రోజుల్లో దాదాపు 30లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్లింది. ఒక స్టార్ హీరో టీజర్‌కి ధీటుగా శంకర్ నటించిన శంభో శంకర టీజర్ అసాధారణ వ్యూస్ దక్కించుకోవడం నిజంగా ఓ సెన్సేషనే. తెలుగు రాష్ట్రాలు సహా తెలుగు ప్రజలు ఉన్న అన్నిచోట్లా గుర్తింపు ఉంటేనే ఇది సాధ్యం. శంకర ఆ ఫీట్‌ని సాధ్యం చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్‌కి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి సత్తా చాటుతుందన్న అంచనాలేర్పడ్డాయి. శంకర్ ని హీరోగా, శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శంభో శంకర
. ఈ టీజర్ సక్సెసైనందుకు శంకర్, దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.