విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణ లో విశ్వనాధ్ తన్నీరు , సురేష్ సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం " యమ్ 6". ధ్రువ , శ్రావణి , అశ్విని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి జైరామ్ దర్శకుడు . ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది .
ఈ సందర్భం గా నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ ఈ సినిమాను క్వాలిటీ లో రాజీ పడకుండా నిర్మించాము . ఈ చిత్రంలోని " ఈ క్షణం" అనే ఒక పాట ఉంది. ఈ పాటను అరకు , మంగళూరు లో సుందరమైన లొకేషన్స్ లో చిత్రీకరించాం . సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు .
దర్శకుడు జైరామ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సస్పెన్స్ తో పాటు కామెడీ , యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి . సినిమాటోగ్రఫీ , సంగీతం బాగా కుదిరాయి అన్నాడు
హీరో ధ్రువ మాట్లాడుతూ ఇది నా తొలి చిత్రం . అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుందీ చిత్రం . ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది . నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ ఋణపడి ఉంటా అన్నాడు .
ధ్రువ , శ్రావణి , అశ్విని , తిలక్ , సాధన ,అప్పలరాజు , గోవింద , హరిత , వంశీ , ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం : విజయ్ బాలాజీ , ఎడిటింగ్ :వంశీ కందాల , సినిమాటోగ్రఫీ : మహ్మద్ రియాజ్ , నిర్మాతలు : విశ్వనాధ్ తన్నీరు , సురేష్, దర్శకత్వం : జైరామ్
VISWANATH FILM FACTORY,
SRI LAKSHMI VENKATADRI CREATIONS ,
PRODUCER VISWANATH TANNEERU,
HERO DHRUVA,
DIRECTOR JAIRAM,
STAR ACTING STUDIO
This website uses cookies.