Social News XYZ     

Naga Chaitanya launched “Ee Maya Peremito” movie first look teaser

`ఈ మాయ పేరేమిటో` ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌

Naga Chaitanya launched "Ee Maya Peremito" movie first look teaser

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ఈ  మాయ పేరేమిటోవి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు.

 

ఈ సంద‌ర్భంగా...యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ "టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ మై ప్లెజర్. రీసెంట్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్ జరిగినప్పుడు రాహుల్ ని చూశా. అందులో కబడ్డీ ఫైట్ విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు కలిశా. గుడ్ లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక... గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్. మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్ నెస్, హిడెన్ టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా`` అన్నారు.

నిర్మాత దివ్య మాట్లాడుతూ "కొన్ని రోజుల క్రితం రెండు లుక్స్ విడుదల చేశాం. మొదటిది ఫస్ట్ లుక్. రెండోది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్. రెండిటికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ విడుదల చేస్తున్నాం. నాన్నగారు అడగగానే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా నాగచైతన్య యస్ చెప్పారు. ఆయన చాలా బిజీ. రెండు సినిమాలు సైమల్టేనియస్ గా షూట్ చేస్తున్నారు. అంత బిజీలోనూ మా కోసం వచ్చినందుకు థాంక్స్. రాహుల్ కి చైతన్య గారంటే చాలా ఇష్టం. మా సినిమా నుంచి మేం విడుదల చేస్తున్న ఫస్ట్ కంటెంట్ ఇదే. చాలా ఎగ్జయిటెడ్ గా, నెర్వస్ గా ఉంది" అన్నారు.

విజయ్ మాస్టర్ మాట్లాడుతూ "ఫైట్ మాస్టర్స్ కుమారులు హీరోలు అవుతున్నారు. హిందీలో అజయ్ దేవగన్ అయ్యారు కదా. రాహుల్ ని 'నువ్వు ఎం అవ్వాలనుకుంటున్నావ్' అని అడిగా. ఫస్ట్ క్రికెట్ ఇష్టం అన్నాడు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు . శ్రీలంక వెళ్లి ఆడాడు కూడా. తర్వాత సడన్ గా ఒక రోజు నేను యాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. యాక్టర్ అవ్వాలంటే డిగ్రీ కావాలన్నాను. ఎందుకు? అన్నాడు. చదువు కావాలని చెప్పా. అయితే నేను నాగచైతన్య చదివిన కాలేజీలో చదువుతానని అన్నాడు. అన్నట్టుగా అక్కడే చదివాడు. డిగ్రీ కంప్లీట్ చేశాడు. చదువు డిస్టర్బ్ కాకుండా ఆరేడేళ్లు యాక్టర్ కావాలని ట్రయినింగ్ తీసుకున్నాడు. నేను ఇంకొకటి చెప్పా... 24 క్రాఫ్ట్స్ లో ట్రయినింగ్ త్రీసుకోవాలని. నాది ఫస్ట్ మాస్టర్ జాబ్. సింగల్ క్రాఫ్ట్. అప్పుడప్పుడూ మిగతా 23 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయలేకపోతున్నా. నువ్వు హీరో కావాలంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయాలి. ఆలా చేయాలంటే ముందు దర్శకుణ్ణి శాటిస్ ఫై చేయాలి. అందుకు సిద్ధమంటే హీరోగా చెయ్. లేదంటే వద్దని చెప్పా. ఆ తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేసి హీరో అయ్యాడు. ఇందుకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు" అన్నారు.

దర్శకుడు రాము మాట్లాడుతూ "అందరికీ థాంక్యూ. అక్కినేని నాగచైతన్యగారికి స్పెషల్ థాంక్స్. '100% లవ్'కి నేను అప్రెంటీస్ గా చేశా. అమ్మానాన్నలు పిల్లల మీద చాలా నమ్మకం ఉంచుతారు. అలా నా మీద నమ్మకం ఉంచినవాళ్లు ఇద్దరు. ఒకరు మా గురువుగారు సుకుమార్ గారు. రెండో వ్యక్తి విజయ్ మాస్టర్. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చి నిలబెట్టింది. అమ్మానాన్నలను ఎలా మర్చిపోమో... వీళ్ళనూ అలాగే మర్చిపోను. సినిమా చాలా బాగా వచ్చింది" అన్నారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ "పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మాయ పేరేమిటో... ప్రేమే. మరో ప్రేమకథ. ఇద్దరు మనుషులు, వాళ్ళ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ బ్యాగ్రౌండ్, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేసే విధానం... ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే... ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు... సినిమాలోని కొన్ని ఎమోషన్స్ మీ ఇంటికి తీసుకువెళతారు. సినిమా బాగుందా? బాలేదా? అనే ఆలోచన కూడా రాదు. ఇటువంటిది మన లైఫ్ లో జరిగిందే... మనం ప్రేమలో ఉన్నప్పుడు ఇలా ఉన్నామే.. మారినప్పుడు ఇలా అయ్యిందే... ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్నామే... అనే ఆలోచనలను ఇంటికి తీసుకువెళతారు. మాకు అంత నమ్మకం ఉంది. మా టీజర్ విడుదల చేసిన నాగచైతన్య అన్నయ్యకు థాంక్స్. ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పడం కాదు. జోష్ సినిమా నుంచి నాగచైతన్య అంటే నాకు ఇష్టం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన మనుషులకు ఇచ్చే మర్యాద ఇష్టం" అన్నారు.

Facebook Comments
Naga Chaitanya launched "Ee Maya Peremito" movie first look teaser

About uma