Social News XYZ     

Tej I Love U movie will defiantly entertain everyone: Sai Dharam Tej

'తేజ్‌' చిత్రం డెఫినెట్‌గా అందర్నీ అలరిస్తుంది
- సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌

Tej I Love U movie will defiantly entertain everyone: Sai Dharam Tej

'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్న సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా 'తేజ్‌' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందాల తార అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై 'తొలిప్రేమ' ఫేమ్‌ ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, వల్లభ నిర్మించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని మొదటి పాటని రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన విషయం అందరికీ తెల్సిందే. కాగా ఈ చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' సెకండ్‌ సాంగ్‌ని జూన్‌ 8న హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లాట్‌ మొబైల్స్‌ షోరూమ్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌, నిర్మాత కె.ఎస్‌. రామారావు, దర్శకులు ఎ. కరుణాకరన్‌, లాట్‌ మొబైల్స్‌ ఎండి స్వప్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం డిటిఎస్‌ మిక్సింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 29న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.

 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''తేజ్‌' చిత్రంలోని రెండో పాట 'నచ్చుతున్నాదే..' పాటని లాట్‌ మొబైల్స్‌లో రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. వెరీ పెప్పీ నంబర్‌ ఇది. హరిచరణ్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా పాడారు. ఈ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమ నన్ను టీజ్‌ చేస్తుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అందరూ ఈ పాటని బాగా ఎంజాయ్‌ చేస్తారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ ప్రెస్టీజియస్‌ బేనర్‌లో ఈ సినిమా చేయడం చాలా లక్కీగా భావిస్తున్నాను. అలాగే హీరోయిన్‌ అనుపమతో వర్క్‌ చేయడం గ్రేట్‌గా ఫీలవుతున్నాను. సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. మంచి సినిమా చేశాం. డెఫినెట్‌గా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన కరుణాకరన్‌గారికి, కె.ఎస్‌. రామారావుగారికి నా కృతజ్ఞతలు'' అన్నారు.

దర్శకుడు ఎ. కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''నా ఫస్ట్‌ ఫిలిం 'తొలిప్రేమ' పవన్‌ అన్నయ్య అవకాశం ఇచ్చి నన్ను దర్శకుడ్ని చేశారు. మళ్ళీ వారి మేనల్లుడు, నా తమ్ముడులాంటి వాడు సాయిధరమ్‌ తేజ్‌ 'తేజ్‌' సినిమాకి అవకాశం ఇచ్చాడు. సినిమా చాలా బాగా వచ్చింది. తేజ్‌, అనుపమ ఇద్దరూ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. ప్రతి ఒక్కరికీ నచ్చేవిధంగా వుంటుంది. ఈ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాత కె.ఎస్‌. రామారావుగారికి నా ధన్యవాదాలు'' అన్నారు.

చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ చిత్రం. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ హీరోహీరోయిన్లుగా నిర్మించిన 'తేజ్‌' చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. చక్కని ప్రేమకథతో దర్శకుడు కరుణాకరన్‌ అందంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పెయిర్‌ బ్యూటిఫుల్‌గా వుందని అందరూ చెప్తున్నారు. సినిమాలో ఇద్దరూ పోటీపడి నటించారు. మా టీమ్‌ అంతా డే అండ్‌ నైట్‌ కష్టపడి ఈ సినిమాకి వర్క్‌ చేశారు. వారందరికీ పేరు పేరునా నా థాంక్స్‌. లాట్‌ మొబైల్స్‌లో మా చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' రెండో పాటని రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. గోపీసుందర్‌ బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. 'తేజ్‌' ఐ లవ్‌ యు సినిమా ఆడియోను జూన్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాయిధరమ్‌కి ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుంది. లాట్‌ మొబైల్స్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ - ''తేజ్‌' చిత్రంలోని 'నచ్చుతున్నాదే' నా ఫేవరేట్‌ సాంగ్‌. అందరికీ నచ్చుతుంది. లాట్‌ మొబైల్స్‌వారికి థాంక్స్‌. చక్కగా ఫంక్షన్‌ని ఆర్గనైజ్‌ చేశారు. జూన్‌ 9న 'తేజ్‌' ఆడియో రిలీజ్‌ అవుతుంది. మెగాస్టార్‌ చిరంజీవిగారు ఆ ఫంక్షన్‌కి చీఫ్‌ గెస్ట్‌గా వస్తున్నారు. చాలా ఎగ్జైట్‌మెంట్‌తో వున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అందర్నీ చూశాక అంతా పోయింది. మమ్మల్ని సపోర్ట్‌ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఆడియన్స్‌ అందరూ మా సినిమా చూసి ఆదరించాలి. తేజ్‌ వెరీ నైస్‌ కోస్టార్‌. ఈ సినిమాలో బాగా నటించడానికి సపోర్ట్‌ చేశారు. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కె.ఎస్‌. రామారావుగారికి, కరుణాకరన్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.

Facebook Comments
Tej I Love U movie will defiantly entertain everyone: Sai Dharam Tej

About uma