Social News XYZ     

Hard work always pays off: Rajinikanth at ‘Kaala’ press meet

అవ‌కాశం గొప్ప‌ది.. అంకిత భావంతో క‌ష్ట‌ప‌డితేనె ప్ర‌తి ఫలం ద‌క్కుతుంది - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

Hard work always pays off: Rajinikanth at 'Kaala' press meetసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో వండర్‌ బార్‌ ఫిలింస్‌ ప్రై.లి, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై ధనుశ్ నిర్మించిన చిత్రం కాలా. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 7న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. క‌రికాలుడుగా ర‌జ‌నీకాంత్ న‌ట విశ్వ‌రూపాన్ని తెర‌పై వీక్షించాల‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు అతృత‌గా, ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ , నిర్మాత ధనుశ్‌, చిత్ర ద‌ర్శ‌కుడు పా.రంజిత్‌, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, ఎ.ఎం.రత్నం, లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి కరుణాకరణ్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, దిల్‌రాజు, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా....

 

తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ‌ను పొంద‌డం నా భాగ్యం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ - ''1978 నా తొలి తెలుగు సినిమా అంతులేని కథ విడుదలైంది. తర్వాత అన్నదమ్ముల సవాల్‌, ఇద్దరూ అసాధ్యులే, తొలిరేయి గడిచింది ఇలా 15-20 సినిమాలు తెలుగులో చేశాను. తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బ్రేక్‌ వచ్చింది. తెలుగులో సినిమాలు చేయాలా? తమిళంలో సినిమాలు చేయాలా? అనే ప్రశ్న వచ్చింది. అయితే కె.బాలచందర్‌ దర్శకత్వంలో నేను తమిళంలో తొలి సినిమా చేశాను. ..కాబట్టి తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను. అయితే తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమను చూపించారో.. అంతే ప్రేమను తెలుగు ప్రేక్షకులు చూపిస్తూ వ‌చ్చారు... వస్తున్నారు. అది నా భాగ్యం. తర్వాత పెదరాయడులో నటించాను. తర్వాత భాషా, నరసింహా, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. సీనియర్‌ ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఈ సమయంలో ఆయన్ను మిస్‌ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే. కె.బాలచందర్‌గారి తర్వాత నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన్ను కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. చాలా పెద్ద మనిషి.. పెద్ద దర్శకుడు. ఓ బిడ్డలా నన్ను ప్రేమించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ధనుశ్‌గారు ఇంతకు ముందు ఒకే రజనీకాంత్‌ అని చెప్పారు. అయితే ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే బాలకృష్ణ, ఒకే వెంకటేశ్‌.. ఇలా అందరూ ఎవరికీ వారు ప్రత్యేకం. కేవలం అవకాశమే అందరినీ పెద్ద వ్యక్తులుగా చేస్తుంది. ఇండస్ట్రీలో దొరికే అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవకాశం రావడం అదృష్ఠం. అవకాశం రావడాన్ని దేవుడుపై నమ్మకం లేనివారు లక్‌ అని అంటే.. దేవుడిపై నమ్మకం ఉండేవాళ్లు దేవుడి ఆశీర్వాదం అంటారు. ఏ రంగం అయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. కష్టపడి.. డేడికేషన్‌తో పనిచేస్తే దానికి ప్రతిఫలం దొరుకుతుంది. రంజిత్‌తో ఇంతకు ముందు కబాలి సినిమా చేశాను. ఆ సమయంలో రజనీలాంటి హీరో యువ దర్శకుడితో సినిమా చేయడమేంటని చాలా మంది అన్నారు. అయితే రంజిత్‌ కథ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్‌ అయ్యాను. రంజిత్ కబాలిని చక్కగా డైరెక్ట్‌ చేశారు. దాంతో మళ్లీ మేమిద్దరం కలిసి మా అల్లుడు ధనుశ్‌ నిర్మాణంలో కాలా సినిమా చేశాం. నేను సినిమాను రెండుసార్లు చూశాను. కమర్షియల్‌గానే కాదు.. సినిమాలో మంచి మెసేజ్‌ కూడా ఉంది. రియాలిటీని మిక్స్‌ చేసి కమర్షియల్‌ సినిమాను తెరకెక్కించడం రంజిత్‌ స్పెషాలిటీ. చాలా బాగా ప్రెజెంట్‌ చేస్తారు. ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్‌ ధారావి. ఆ స్లమ్‌లోని మనుషుల జీవితం ఎలా ఉంటుంది? వారికి ఎలాంటి సమస్యలుంటాయి? అనే అంశాలతో సినిమా చేశాం. సాధారణంగా హీరో క్యారెక్టర్‌కో, మరో క్యారెక్టర్‌కో ప్రాధాన్యత ఉంటుంది. కానీ కాలా సినిమాలో ఐదారు క్యారెక్టర్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్‌ మనకు గుర్తుంటుంది. ఎమోషనల్‌ అంశాలతో పాటు స్లమ్‌లో ఉండేవాళ్ల సమస్యలేంటని ఈ సినిమాలో చక్కగా చెప్పారు. సంతోశ్‌ నారాయణ్‌ ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈశ్వరీరావు , హ్యూమా ఖురేషీ అద్భుతంగా నటించారు. ధనుశ్‌ నిర్మాతగా ఎలా చేస్తారో అనే సందేహం ఉండేది. నేను చక్కగా నటించడమే కాదు.. చక్కగా సినిమాను నిర్మిస్తానని ప్రూవ్‌ చేశారు ధనుశ్‌. డెఫనెట్‌గా సినిమా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది'' అన్నారు.

ఇప్పుడు ఎప్పుడూ ర‌జ‌నీకాంత్ ఒక్క‌డే

చిత్ర నిర్మాత ధనుశ్‌ మాట్లాడుతూ - ``కాలా` అనేది ప్రజల సినిమా. ప్రజల మీద, ప్రజల కోసం చేసిన సినిమాయే కాలా. బోల్డ్‌ సినిమా. చాలా బాగా రీసెర్చ్‌ చేసి చేసిన సినిమా. డైరెక్టర్‌ రంజిత్‌ ధారావి ప్రజల ఎలా జీవిస్తారనే దానిపై రీసెర్చ్‌ చేశారు. వారి సమస్యలు, పోరాటాలు, బ్రతుకు అంశాలు అన్నింటిని చిత్రీకరించారు. ధారావిలోనే కాదు.. నిర్లక్ష్యం చేయబడ్డ ప్రజల గురించి చెప్పే చిత్రమే ఇది. సామాన్యుడి బ్రతుకు చిత్రాన్ని తెరపై చక్కగా చూపించేది.. సామాన్యుడి కోసం పోరాడేవాడు.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారి కంటే గొప్పగా ఎవరుంటారు. నలబై ఏళ్లుగా ప్రజలు ఆయనపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఆయన్ను పూజిస్తున్నారు. చాలా మంది ఈ సీక్రెట్‌ను చేధించాలని ప్రయత్నించారు. ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది హీరోలు రజనీకాంత్‌లా కావాలని కలలు కంటారు. కానీ ఇప్పుడు.. ఎప్పుడూ రజనీకాంత్‌ ఒకడే. ఆయన మన దేశాన్ని గర్వంగా ఫీలయ్యేలా చేస్తున్నారు. ఆయన మన దేశానికి ప్రతీక అని చెప్పడం అతిశయోక్తి అనిపించినా అది నిజం. అలాంటి వ్యక్తి సినిమా 'కాలా'ను నేను నిర్మించడం నా అదృష్టం. అవకాశం ఇచ్చిన రజనీ సార్‌! ఎంటైర్‌ యూనిట్‌కి థాంక్స్‌. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. యూనిట్‌ చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు, విమర్శకులు అందరూ ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది'' అన్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు

పా.రంజిత్‌ మాట్లాడుతూ - '''కాలా' సినిమాపై భారీ అంచనాలుంటాయనడంలో సందేహం లేదు. సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. రజనీసార్‌! యాక్టింగ్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. ఇందులో రాజకీయాల గురించి కూడా చర్చిచాం. స్లమ్‌లో ఉండే ప్రజల మనిషిగా రజనీకాంగ్‌గారు కనపడతారు. భూ సమస్యలు గురించి ఈ సినిమాలో చూపించాం. భూమి అనే హక్కును చూపించాం. డిఫరెంట్‌ స్టయిల్లో రజనీకాంత్‌గారి హీరోయిజాన్ని చూస్తారు'' అన్నారు.

సినిమా ఇండ‌స్ట్రీలో క‌న‌ప‌డే దేవుడు

ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో చాలా సంవత్సరాల తర్వాత కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆయన నటించిన బాబా సినిమాను సీడెడ్‌లో నేనే విడుదల చేశాను. ఆ సినిమా విడుదలైన వారం తర్వాత రజనీకాంత్‌గారు ఫోన్‌ చేసి సినిమా ఎలా ఉంది? అన్నారు. యావరేజ్‌గా ఉందని అన్నాను. ఆయన మద్రాసు పోన్ చేసి పిలిపించారు. సినిమా ఎంత లాస్‌ అయ్యిందో మేనేజర్‌ ద్వారా కనుక్కున్నారు. కోటి అరవై లక్షలు నష్టం తేలింది. మరుసటి రోజు మళ్లీ రమ్మని పిలిచి కోటి అరవై లక్షలతో పాటు మరో లక్ష రూపాయలను అదనంగా ఇచ్చిన గొప్ప వ్యక్తి రజనీకాంత్‌గారు. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మనకు కనపడే దేవుడు రజనీకాంత్‌గారు. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి చెప్పాలంటే మ‌రో ఉదాహ‌ర‌ణ చెప్పాలి. ఓసారి ఓ హిందీ సినిమా చూసి.. రజనీకాంత్‌గారికి ఫోన్‌ చేసి సార్‌.. మీరు ఈ సినిమా చేస్తే బావుంటుదని చెప్పాను. రాత్రి ఏడున్నరకు చెబితే మళ్లీ ఆ రాత్రికే సినిమా చూసి నాకు ఫోన్‌ చేశారు. రెస్ట్‌లో ఉండాలనుకుంటున్నాను. ఆ సినిమాను మైండ్‌లో పెట్టుకుంటే కష్టం అని అన్నారు. ఆయ‌న‌కు చెప్పాల్సిన అవ‌స‌రం లేకున్నా.. చెప్ప‌డం ఆయ‌న గొప్ప‌త‌నం. ఆయన మంచితానికి నేనే నిదర్శనం. అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మరెన్నో సంచలన విజయాలను నమోదు చేసి ప్రజలందరికీ దగ్గరై.. మహోన్నత వ్యక్తిగా ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. స్టార్‌డమ్‌ను కూడా వదులుకుని నిబద్ధతతో ఓ పని చేయబోతున్నారు. ధనుశ్‌గారు వండర్‌ బార్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాను చేశారు. ఇండియన్‌ సినిమాల్లో ఇది గ్రేటెస్ట్‌ మూవీగా ఇది నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను'' అన్నారు.

భిన్నంగా.. స్టైలిష్‌గా...

ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారి గురించి చెప్పాలంటే ఆయన సింప్లిసిటీ, స్టయిల్‌ చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌. గతంలో ఆయనతో అరుణాచలం, నరసింహా సినిమాలు చేశాను. ఈ రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన్ను అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు అభిమానిస్తారు. రంజిత్‌గారు ముంబై బ్యాక్‌డ్రాప్‌లో నేచురల్‌గా 'కాలా' సినిమాను తెరకెక్కించారు. ధనుశ్‌గారు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడం ఆనందంగా ఉంది. రజనీకాంత్‌గారి గత చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా మరిత, స్టైల్‌గా ఉంటుంది. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కెరీర్‌లో మ‌ర‌చిపోలేని పాత్ర‌

ఈశ్వరీరావు మాట్లాడుతూ - ''ఇంత పెద్ద ఫ్లాట్‌పామ్‌ ఇచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారికి థాంక్స్‌. ఈ వేదికపై ఇలా నిల్చుని మాట్లాడుతున్నానంటే కారణం ధనుశ్‌గారు, రంజిత్‌గారే కారణం. రజనీకాంత్‌గారి జోడిగా ఈ సినిమాలో నటించాను. నా లైఫ్‌లో మరిచిపోలేని క్యారెక్టర్‌. జూన్‌ 7న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.
ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డం అదృష్టం

హ్యూమా ఖురేషి మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో కలిసి నటించడం గొప్ప అదృష్టం. బ్యూటీఫుల్‌ స్క్రిప్ట్‌ రాసిన రంజిత్‌గారికి, నన్ను సినిమాలో నటింప చేసేందుకు అంగీకరించిన ధనుశ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాలో నటించిన వారందితో మంచి అనుబంధం ఏర్పడింది. బ్యూటీఫుల్‌ జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

ర‌జ‌నీకాంత్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోశ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ - ''ధారావి ప్రాంతంలో స్లమ్‌ ప్రజల గురించి ఈ సినిమా చెబుతుంది. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా 60 శాతం మందికి ఉండటానికి స్వంత జాగా లేదు. అది ఎందుకో తెలియదు కానీ.. మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సమస్య గురించి కాలా చిత్రంలో పెద్ద ఎత్తున డిస్కస్‌ చేశారు. రజనీకాంత్‌గారి వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ యాక్టింగ్‌ను మరోసారి ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్‌ చేశాను. నానా పటేకర్‌, హ్యూమాఖురేషి, ఈశ్వరీరావు అందరూ చక్కగా నటించారు. తెలుగులో సినిమా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

అద్భుతమైన సినిమా అవుతుంది

మారుతి మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారి గురించి, ఈ సినిమా గురించి మాట్లాడేటంతటివాడిని కాను. అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ట్రైలర్స్‌ అన్నీ చాలా బావున్నాయి. రజనీకాంత్‌గారు ఇలాంటి మంచి సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

19 ఏళ్ల త‌ర్వాత .....

దిల్‌రాజు మాట్లాడుతూ - ''రత్నంగారు 1999లో చేసిన నరసింహా సినిమాను నేను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేశాను. నేను అప్పుడే డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అంత పెద్ద సక్సెస్‌ను ఎంతో బాగా ఎంజాయ్‌ చేశానో నాకు తెలుసు. ఆ త‌ర్వాత అంటే.. 19 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్‌గారి సినిమాను నైజాంలో రిలీజ్‌ చేస్తున్నాం. ధనుశ్‌ నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ అయినా ఓ ప్యాషన్‌తో మామగారి సినిమా చేసే అవకాశాన్ని పొందారు. కబాలి తర్వాత మళ్లీ రంజిత్‌తో సినిమా చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ టు టీమ్‌'' అన్నారు.

Facebook Comments
Hard work always pays off: Rajinikanth at 'Kaala' press meet

About uma

%d bloggers like this: