సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా
ఆయన చేతుల మీదుగా
`సమ్మోహనం` ట్రైలర్ విడుదల
సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు (గురువారం) ఆయన చేతులమీదుగా సమ్మోహనం
ట్రైలర్ విడుదలైంది. సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం సమ్మోహనం
. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కిన సమ్మోహనం
జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమ్మోహనం
ట్రైలర్‌ను విడుదల చేసిన సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ సమ్మోహనం` టైటిల్ చాలా బావుంది. శివలెంక కృష్ణప్రసాద్‌గారు తీసిన `ఆదిత్య 369` చాలా గొప్ప సినిమా .`సమ్మోహనం` లో ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బావున్నాయి. `సమ్మోహనం` ట్రైలర్ చూస్తుంటే పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తోంది. సుధీర్ ఇదివరకు సినిమాలకన్నా ఈ సినిమాలో చాలా బావున్నాడు. ట్రైలర్ చాలా ఇంప్రసివ్‌గా ఉంది. ఈ పిక్చర్ సూపర్‌డూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుందని భావిస్తున్నా. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు దర్శకత్వం వహించిన గత చిత్రాలన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. ఈ సినిమా కూడా వాటిని మించి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా
అని అన్నారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రామారావుగారి అభిమానులైనా, నాగేశ్వరరావుగారి అభిమానులైనా, మరే హీరో అభిమానులైనా.. అందరూ కృష్ణగారి అభిమానులే. కృఫ్ణగారి సినిమాలు చూస్తూ మేమందరం పెరిగాం. ఆయన్ని అంతగా ప్రేమించేవాళ్లం. అలాంటి సూపర్‌స్టార్ కృష్ణగారి పుట్టినరోజున మా ట్రైలర్‌ని ఆయనే విడుదల చేయడం మా అదృష్టం. వెరీ వెరీ హ్యాపీ క్షణాలివి. చల్లని చేతులతో కృష్ణగారు మాకు ఆశీర్వాదం అందించారు. మేం అద్భుతమైన విజయం సాధించబోతున్నాం
అని అన్నారు.
హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ ముందుగా మావయ్యగారు సూపర్‌స్టార్ కృష్ణగారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా నా చిత్రం` సమ్మోహనం` ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. మావయ్యగారికి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. టీజర్ ఎలాగైతే ప్రేక్షకులు అందరికీ నచ్చిందో, ట్రైలర్ కూడా అలాగే తప్పకుండా నచ్చుతుంది. జూన్ 15న సినిమా విడుదలవుతుంది
అని అన్నారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సూపర్‌స్టార్ కృష్ణగారి సినిమాలు చూస్తూ, తీవ్రంగా అభిమానిస్తూ పెరిగాను. ఆయన చేతుల మీదుగా మా `సమ్మోహనం` సినిమా ట్రైలర్ ఇవాళ ఆవిష్కృతమైంది. ఇంతకంటే శుభసూచికం ఉండదని అనుకుంటున్నా. మా `సమ్మోహనం` ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. కథలో అందమైన రొమాన్స్ తో పాటు ఆరోగ్యకరమైన హాస్యం మిళితమై ఉంటుంది. అర్థవంతమైన పాత్రలుంటాయి. ఉత్కంఠభరితంగా సాగుతుంది. నేను తీసిన సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమా. నేను మరింతగా ప్రేమించి తీసిన సినిమా. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధీర్ చాలా కొత్తగా ఉంటాడు. అత్యుత్తమస్థాయి నటనను సుధీర్ చూపించగలరనడానికి మా చిత్రం ఓ ఉదాహరణ. నాయిక అదితీరావు హైదరీ అద్భుతంగా చేశారు. నరేశ్ స్పెషల్ పాత్రలో చేశారు. పవిత్ర లోకేష్, హర్షిణి, రాహుల్ రామకృష్ణ... ఇలా అందరూ కలిసి చాలా బాగా చేశారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న నటీనటులు ఒకచోట కలిస్తే ఎంత బావుంటుందో ఈ సినిమా ఒక ఉదాహరణ. మేం ఎంతగానో ప్రేమించి తీసిన ఈ సినిమా మేం ఎంతగానో ప్రేమించే కృష్ణగారి చేతుల మీదుగా విడుదల కావడం నాకు చాలా ఆనందగానూ, గర్వంగానూ ఉంది. జూన్ 15న `సమ్మోహనం` ప్రేక్షకుల ముందుకు రానుంది. నా గత చిత్రాల్లాగానే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకం ఉంది
అని చెప్పారు.
సమ్మోహనం
ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా చిత్ర యూనిట్‌తో సూపర్ స్టార్ కృష్ణ సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఆ సరదా ప్రశ్నల సమాహారం..
మోహనకృష్ణ ఇంద్రగంటి: సమ్మోహనం
అనగానే మీకేమైనా జ్ఞాపకాలు వచ్చాయా? ఈ మధ్య కాలంలో స్వచ్ఛమైన తెలుగు టైటిళ్లు రావడం మళ్లీ మొదలైంది. రంగస్థలం
, మహానటి
వంటివి.
కృష్ణ: సమ్మోహనం
అనే టైటిల్‌ని ఇంతకు ముందు ఎవరూ పెట్టలేదు. టైటిల్స్ విషయానికి వస్తే అచ్చ తెలుగు టైటిల్స్ బావుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్సే పెట్టాం. మేం ఎప్పుడూ అదర్ లాంగ్వేజ్ టైటిల్స్ పెట్టలేదు. మోసగాళ్లకు మోసగాడు
, పండంటి కాపురం
, అల్లూరి సీతారామరాజు
, పాడిపంటలు
, ప్రజా రాజ్యం
, ఈనాడు
... అవన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం.
సుధీర్: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ ఏంటి?
కృష్ణ:- పండంటి కాపురం
లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చిన సినిమా ఇది. విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులు ఆడింది. 14 సెంటర్లలో 25 వారాలాడింది .
మోహనకృష్ణ ఇంద్రగంటి: మా విజయవాడలో జోక్ ఉండేది.. కృష్ణగారి సినిమాలు ప్రొజెక్టర్‌లో ఇరుక్కుపోతాయి
.. ఒకసారి థియేటర్లలోకి వస్తే అంత తేలిగ్గా పోవు అనే టాక్ ఉండేది. నేను విజయవాడలో పెరిగాను. కృష్ణగారికి అక్కడ అభిమానులు ఎక్కువండీ.
కృష్ణ: మా సొంత పిక్చర్లు ఎప్పుడు తీసినా విజయవాడకు వెళ్లేవాడిని.
ఇంద్రగంటి: రామ్ రాబర్ట్ రహీం
తీసినప్పుడు అలంకార్ థియేటర్ నుంచి మొత్తం దారంతా గులాబీపువ్వుల రెక్కలను పరిచి మీకు స్వాగతం పలికారు. అప్పట్లో అది పెద్ద న్యూస్.
కృష్ణ:నవయుగ వాళ్లు చేసుంటారు.
సుధీర్: మహేశ్ పుట్టినరోజు చిన్నప్పుడు ఎలా చేసేవారు?
కృష్ణ: చిన్నప్పుడు మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు.
శివలెంక కృష్ణప్రసాద్: ఇప్పుడు అభిమానులు చేస్తున్నారు.
కృష్ణ: ఆ.. అవును.. అభిమానులు చేస్తున్నారు.
శివలెంక కృష్ణప్రసాద్: మీ సంస్థ ఎంత మందికి భోజనం పెట్టిందో. పద్మాలయాలో భోజనం చేయని వారు ఉండేవారు కాదు.
కృష్ణ: మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదం, తయిర్ సాదం అని పెట్టేవారు. కానీ మనం కంపెనీ పెట్టినప్పుడు అగ్నిపరీక్ష
నుంచే నాన్ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలిన వాళ్లు కూడా చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి: అన్ని షిఫ్ట్ లు మీరే కదా సార్ చేశారు. సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు...
శివలెంక కృష్ణ ప్రసాద్: అన్నీ సాహసాలన్నీ ఆయనే చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి: 70 ఎం ఎం అంటే విజయవాడలో... మాకు లార్జ్ 70 ఎంఎం అని అప్పట్లో పెద్ద థ్రిల్ అనమాట మాకు..
కృష్ణ: ఫస్ట్ కౌబోయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ ... మామూలుగా అప్పట్లో కలర్ ప్రింట్ రూ.60వేలు అయ్యేది. 70ఎంఎం ప్రింట్ రెండు లక్షలయ్యేది. మూడు నెలల ముందు ఆర్డరిచ్చి డబ్బులు కడితేగానీ, లాస్ ఏంజెల్స్ నుంచి ఫిల్మ్ పంపేవారు కాదు. ప్రసాద్ 70 ఎంఎం థియేటర్ కట్టారు కానీ, ఎవరూ సినిమాలు చేయలేదు. మనమే ముందు చేశాం. తమిళ్లోనూ రజనీకాంత్‌తో ఓ సినిమా చేశాం. అదీ 70 ఎంఎం. రాజ్ థియేటర్ దగ్గర సింహాసనం
చిత్రానికి రెండు కిలోమీటర్ల క్యూ ఉంటే రిలీజ్ రోజు 144 సెక్షన్ పెట్టారు. టిక్కెట్ లేని వారిని ఎవరినీ ఆ రోడ్డులో రానివ్వలేదు.
సుధీర్: ఇటీవల మహానటి
వచ్చింది కదా.. మీ బయోపిక్ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది?
కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం.
సమ్మోహనం
నటీనటులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, డా .వీకే నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్, శిశిర్‌శర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, పాటలు: సిరివెన్నెల
సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ,నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
This website uses cookies.