Tik Tik Tik movie to release on June 22nd

జూన్ 22న టిక్ టిక్ టిక్

బిచ్చగాడు, 16 చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్ లొ ప్రత్యేక గుర్తింపు ను సంపాందించారు. చదలవాడ బ్యానర్ లొ సినిమా అంటే అది సమ్‌థింగ్ స్పెషల్. తాజాగా ఈ టిక్ టిక్ టిక్ అనే సినిమా ఈ బ్యానర్ లొ రాబొతొంది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో తొలి అంత‌రిక్ష సినిమాగా "టిక్ టిక్ టిక్ " చరిత్ర సృష్టించనుంది.

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతొంది. చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై చదలవాడ ప‌ద్మావ‌తి , చదలవాడ లక్ష్మణ్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. జూన్ 22న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ భాషల్లొ గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతోంది.

నిర్మాత లక్ష్మ‌ణ్ మాట్లాడుతూ - టిక్ టిక్ టిక్‌అంత‌రిక్ష నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ. సినిమా చూసే ప్రతి ప్రేక్ష‌కుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది‌. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా.ఇప్పటికే విడుద‌లైన ట్రైల‌ర్‌ మిలియన్ వ్యూస్ ను రీచ్ అయింది. బిచ్చ‌గాడు, 16  సినిమాలను తెలుగులో విడుద‌ల చేసిన‌ప్పుడు ఇక్క‌డ ప్రేక్ష‌కులు ఎంత‌గానో మ‌మ్మ‌ల్ని, మా బ్యానర్ ను ఆద‌రించారు. ఆ చిత్రాలను మించెలా తెరకెక్కిన విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్ ఇది. ఇండియ‌న్ సినిమాలో తొలి స్పేస్ మూవీని మా బ్యానర్ లో తీసుకురావటం గర్వంగా ఉందన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%