జూన్ 22న టిక్ టిక్ టిక్
బిచ్చగాడు, 16 చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్ లొ ప్రత్యేక గుర్తింపు ను సంపాందించారు. చదలవాడ బ్యానర్ లొ సినిమా అంటే అది సమ్‌థింగ్ స్పెషల్. తాజాగా ఈ టిక్ టిక్ టిక్ అనే సినిమా ఈ బ్యానర్ లొ రాబొతొంది. ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా "టిక్ టిక్ టిక్ " చరిత్ర సృష్టించనుంది.
జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతొంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి , చదలవాడ లక్ష్మణ్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. జూన్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లొ గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతోంది.
నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ - టిక్ టిక్ టిక్
అంతరిక్ష నేపథ్యంలో రూపొందిన తొలి ఇండియన్ మూవీ. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను రీచ్ అయింది. బిచ్చగాడు
, 16 సినిమాలను తెలుగులో విడుదల చేసినప్పుడు ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో మమ్మల్ని, మా బ్యానర్ ను ఆదరించారు. ఆ చిత్రాలను మించెలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్ ఇది. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని మా బ్యానర్ లో తీసుకురావటం గర్వంగా ఉందన్నారు.