మే 26న హీరో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లోగో ఆవిష్కరణ
ప్రేమ కథా చిత్రం , భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాంటి విభిన్న ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో నటించిన హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ని స్టార్ట్ చేసారు. మే 26న సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రొడక్షన్ లోగోని వైభవంగా ప్రారంభిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుని హ్యాండ్ సమ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో కెరీర్ ని ముందుకు కొనసాగిస్తున్న సుధీర్‌బాబు నిర్మాత గా మారి వరుస చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రొడక్షన్ నెం1 గా ఓ చిత్రం ప్రారంభించి దాదాపు 80 శాతం కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం గా వస్తున్న సమ్మెహనం విడుదల కి సిద్దంగా వుంది. అలానే మరో విభిన్న కధతో సిద్దమవుతున్న వీరభోగవసంత రాయులు అనే చిత్రం కూడా షూటింగ్ చివరి భాగంలో వుంది. ఇదిలా వుండగా అగష్టు నుండి పుల్లెల గోపిచంద్ బయోపిక్ షూటింగ్ తో బిజీ అవుతారు.. ఓ పక్క హీరోగా బిజీగా వుంటూనే మరో పక్క ప్రోడక్షన్ ప్రారంభిచటం విశేషం..