Lakshmi Manchu’s “Wife Of Ram” movie first look Poster released, trailer on June 1st

జూన్ 1న ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ ట్రైలర్

కెరియ‌ర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి ఈసారి ధీక్ష గా ప్రేక్ష‌కుల‌కు స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుంది. ప్యూర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపోందిన "వైఫ్ ఆఫ్ రామ్" టీజ‌ర్ విడుద‌లై ఇండ‌స్ట్రీ లోనూ, ప్రేక్ష‌కుల‌లోనూ ప్ర‌త్యేక ఆస‌క్తిని రాబ‌ట్టుకోగ‌లిగింది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఆమె పేరు ధీక్ష ఆమెకు ఒక స‌మ‌స్య ఉందా ! లేక ఆమే ఒక స‌మ‌స్యా..? అనే పాయింట్ తో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగుతుంది ఈ సినిమా అంటోంది చిత్ర యూనిట్. జూన్ 1న వైఫ్ ఆఫ్ రామ్ ట్రైల‌ర్ ని విడుద‌ల కాబోతుంది. స‌మాజం ను ప్ర‌భ‌వితం చేసిన మ‌హిళ‌ల స‌మ‌క్షంలో ఈ ట్రైల‌ర్ ను లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఆమె జీవితంలో గుండెలు ప‌గిలే సంఘ‌ట‌న‌లుంటాయి.. ప్ర‌తి దానికి భ‌య‌ప‌డుతుంది, భ‌యం అంటే తెలియ‌ని దానిలా ప్ర‌వ‌ర్తిస్తుంది. ఒక న్యాయం కోసం త‌ను చేసే పోరాటంలో ఆమె ఒక‌లా  ఉండ‌దు. ఎవ‌రికీ త‌న పై  అభిప్రాయం ఏర్ప‌రుచుకునే అవ‌కాశం ఇవ్వ‌దు.. ఆమె ధీక్ష .. ఇలాంటి పాత్ర  తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతుల‌ను అందిస్తాయి. అంటుంది చిత్ర బృందం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాను జూన్ లో విడుద‌ల‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వైఫ్ ఆఫ్ రామ్’లో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు.. ఎడిటర్ : తమ్మిరాజు,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుహాసిన రాహుల్, మాటలు : సందీప్ గుంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, పి.ఆర్.వో.: జి.ఎస్.కే మీడియా గ్రూప్, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%