Social News XYZ     

Vijay Deverakonda’s Taxiwaala in post-production work

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ "టాక్సీవాలా".... జూన్ ద్వితియార్ధం లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

Vijay Deverakonda's Taxiwaala in post-production work

అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్నచిత్రం టాక్సీవాలా. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంభందించిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కి చాలా క్రిటిక‌ల్ అప్లాజ్ రావ‌టం విశేషం. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. జూన్ రెండ‌వ వారంలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి.క్రియెష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది. జూన్ ద్వితియార్ధం లో ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా టాక్సీవాలా లో క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్ యూత్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ ద్వితియార్ధంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు

సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
సౌండ్ - సింక్ సినిమా
స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ - కృష్ణ కాంత్
మ్యూజిక్ - జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి
నిర్మాత - ఎస్ కె ఎన్ (SKN)
ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 మరియు యువి పిక్చర్స్ (GA2 & UV PICTURES)
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్

Facebook Comments
Vijay Deverakonda's Taxiwaala in post-production work

About uma