సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘లా’ (లవ్ అండ్ వార్)
సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలాఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి ‘లా’.. ‘‘లవ్అండ్ వార్’’ అనేది ఉపశీర్షిక. పూర్తి స్థాయి క్రైం మరియు సస్పెన్స్థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ షూటింగంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోఉంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మీడియా సమావేశం ఏర్పాటుచేసింది చిత్ర యూనిట్.
హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ:
‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలాఆలోచించాను. కానీ దర్శకుడు గగన్ గోపాల్ చాలా డిటైల్డ్ గా కథచెప్పాడు. అతను కథను చెప్పిన తీరే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇది పూర్తి స్థాయిక్రైం థ్రిల్లర్ . కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. ‘లా’ అనే టైటిల్ కూడా కథలోంచే వచ్చింది.సినిమా కథనం చాలా సీరియస్ గా సాగుతుంది. ఈ టైటిల్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను మన జీవితాల్లో బాగా వినిపించేపదం కాబట్టి ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనిపించింది. ఈ సినిమాను విజయవాడలోఎక్కువ బాగం షూట్ చేసాము. అదే చాలా ప్రెష్ ఫీల్ ను తెచ్చింది. ఇందులో ఒక టఫ్పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. నిర్మాతలు శివ, రమేష్ లు కొత్త వారైనా డైరెక్టర్ కి టీం కిచాలా బాగా సపోర్ట్ చేసారు.’ అన్నారు
మౌర్యాణి మాట్లాడుతూ:
‘తెలుగు లో నేను చేస్తున్న ఏడో సినిమాఇది. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలాడిటైల్డ్ గా నా క్యారెక్టర్ ని చెప్పారు. ఫెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ వున్నపాత్ర కు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆనందం కలిగింది. తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వాతావరణంలో సినిమా షూటింగ్జరిగింది. సినిమాటోగ్రఫర్ అమర్ కుమార్ అందించిన సహాకారం ఎప్పటికీమరిచిపోను. ప్రొడ్యూసర్స్ కి, దర్శకుడు గగన్ గోపాల్ కి థ్యాంక్స్ . కమల్ గారితో వర్క్ చేయడం ఇదేమొదటిసారి అయినా చాలా కో ఆపరేటివ్ గా ఉన్నారు. ఏదో తెలియని విషయం తెలుస్తూ ఉంటుంది కమల్ కామరాజు గారితో మాట్లాడుతుంటే.. ఈ సినిమాప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
దర్శకుడు గగన్ గోపాల్ ముల్క మాట్లాడుతూ:
‘ మంచి ట్వస్ట్ లతో ఆద్యంతం ఉత్కంఠతరేపెత్తే కథనాలతో ‘లా’ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. నా మీద నమ్మకంతో ఈ కథ ఇంత బాగారావడానికి నిర్మాతలు అందించిన సపోర్ట్ కి థ్యాంక్స్. సత్య కశ్యప్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి ప్రధానం బలంగా మారింది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా నిర్మాతలుసినిమా పై, నాపై నమ్మకంతో మాకు సపోర్ట్ గానిలిచారు..సహాకరించిన టీం అందరికీ ధన్యవాదాలు’అన్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులుజరుపుకుంటున్న ‘లా’ మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.
లా( లవ్ అండ్ వార్)
ఆర్టిస్ట్స్ :
మౌర్యాణి
3.పూజా రామచంద్రన్
4.మంజు భార్గవి
రవి మల్లేడి
క్రిష్ఱమూర్తి
వానపల్లి పెద్దిరాజు
9.నవనీత్
10.అవంతిక
టెక్నిషియన్స్:
1.లిరిక్స్: పూర్ణశర్మ, కరణాకర్
2.ఆర్ట్ : రమేష్
4.ఫైట్స్: డ్రాగెన్ ప్రకాశ్
5.ఎడిటింగ్: ఎస్. ఎస్. సుంకర
6.కెమెరామెన్: పి. అమర్ కుమార్
సహానిర్మాత : మద్దిపాటి శివ, నిర్మాత : రమేష్ బాబు మున్నా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: గగన్ గోపాల్ ముల్క
This website uses cookies.