Social News XYZ     

Sumanth Ashwin’s new movie “Prema Katha Chitram 2” launched

ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 "ప్రేమ కథా చిత్రం 2" ప్రారంభం

Sumanth Ashwin's new movie "Prema Katha Chitram 2" launched

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా "ప్రేమ కథా చిత్రం 2" సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ కొట్టారు. అమరేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అఖిల్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హరి కిషన్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడు గా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్ గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్,
సంగీతం - జెబి
డైలాగ్ రైటర్ - చంద్ర శేఖర్
ఆర్ట్ - అశోక్
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్

Facebook Comments
Sumanth Ashwin's new movie "Prema Katha Chitram 2" launched

About uma