నిర్మాణానంతర పనుల్లో `దేశంలో దొంగలు పడ్డారు`
ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్ పై గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్- కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు
. ఈ సినిమా ఇటీవల షూటిగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంత పనులు తుది దశలో ఉన్నాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. వైజాగ్, సీలేరు, చింతపల్లి, డొంకరాయ, హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేసాం. ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎవ్వరూ చేయని లోకేషన్లలో షూటింగ్ చేసాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. హ్యామన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడు సమాజంలో జరుగుతోన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించాం. ఓ కాన్సెప్ట్ లా తీర్చిదిద్దాం. కథలో రొమాన్స్ కు ప్రాధాన్యతుంది. యువతకు బాగా చేరువవుతుంది. సినిమా బాగా వచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. క్రైమ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత్రలన్ని వేటికవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. డబ్బింగ్ పూర్తయింది. ఆర్.ఆర్. కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మే ద్వితియార్థంలో టీజర్ రిలీజ్ చేస్తాం. జూన్ లో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం
అని అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన కార్తికేయ మాట్లాడుతూ,కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. నటీనటులంతా బాగా నటించారు. షూటింగ్ పూర్తయింది. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. క్రైమ్ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈనెలలో టీజర్ రిలీజ్ చేస్తాం. అలాగే జూన్ లో సినిమా రిలీజ్ చేస్తాం
అని అన్నారు.
ఇతర పాత్రల్లో గిరిధర్, జబర్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు. జి. రెడ్డి, కళ: మధు రెబ్బా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కరుణాకర్, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ.