మే 11 నుంచి హైద్రాబాద్ లో "పడి పడి లేచే మనసు" తాజా షెడ్యూల్
యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "పడి పడి లేచే మనసు". శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల కలకత్తాలో ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం హైద్రాబాద్ చేరుకొంది. మే 11 నుంచి హైద్రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది.
నేడు (మే 9) చిత్ర కథానాయకు సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హను రాఘవపూడి స్టైల్ లో టిపికల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హైద్రాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: హను రాఘవపూడి