`నా నువ్వే` ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ - నందమూరి కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం నా నువ్వే
. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన చిత్రం నా నువ్వే
. శరత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ - జయేంద్రగారు డైరెక్ట్ చేసిన `180` సినిమాను నేను చూశాను. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేయాలనగానే.. జయేంద్రగారేమో ప్యూర్ లవ్ స్టోరీస్ చేస్తారు... మనమేమో మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తాం. నాకు నమ్మకం లేదండి అన్నాను. అయితే మహేశ్ `లేదు సార్.. నిజం సార్.. అందులో పి.సి.శ్రీరామ్‌గారు కెమెరామెన్ అండి` అన్నారు. కలా? నిజమా? అనుకున్నాను. ఘర్షణ, గీతాంజలి వంటి సినిమాలు చూసి ఆయనలాంటి కెమెరామెన్‌తో ఎప్పుడో వర్క్ చేస్తామో.. అంత పెద్ద కెమెరామెన్ మనతో వర్క్ చేయడం కలగా మిగిలిపోతుందనుకున్నాను. అయితే జయేంద్రగారి వల్ల కల నిజమైంది. ఈ సినిమా చేసే సమయంలో ఇందులో నేను హీరోగా చేయడం కరెక్టేనా? అని అడిగాను. `రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే నిన్ను కొత్త యాంగిల్‌లో చూపి సక్సెస్ అయితే.. సినిమా ఆటోమెటిక్‌గా సక్సెస్ అయిపోతుంది` అని జయేంద్రగారు అన్నారు. రీసెంట్‌గా సినిమా చూశాను. నాలో కనపడ్డ చేంజ్ ఓవర్ క్రెడిట్ అంతా జయేంద్రగారికే దక్కుతుంది. ఇందులో చాలా కొత్తగా కనపడతాను. అలాగే పి.సి.శ్రీరాంగారితో పనిచేయడం నా అదృష్టం. శరత్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. దానికి తన సంగీతంతో శరత్‌గారు ప్రాణం పోశారు. తమన్నా తప్ప మరో హీరోయిన్ ఉంటే ఈ సినిమాలో నేను నటించలేకపోయేవాడిని. తమన్నా.. నా వర్క్‌ను ఈజీ చేసేసింది. ఇప్పటి వరకు నేను పనిచేసిన కోస్టార్స్‌లో నా బెస్ట్ కోస్టార్ తమన్నాయే. నేను లవ్‌స్టోరీలో నటించాలని బలంగా కోరుకుంది మహేశ్ కోనేరు. ఈ సినిమా నా కోసం జయేంద్రగారు అండ్ టీం నమ్మమని మహేశ్ నన్ను ముందుకు నడిపించారు. అలాగే నిర్మాతలు కిరణ్, విజయ్‌లు ఎంతో సపోర్ట్ అందించారు. ఇదొక మంచి జర్నీ
అన్నారు.
తమన్నా మాట్లాడుతూ - కొత్త దర్శకులు అందరూ జయేంద్రగారితో వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి మంచి దయగల, మృదు స్వభావంగల, స్వచ్ఛమైన ప్రేమ, ఎమోషన్స్‌ను కలిగిన వ్యక్తి జయేంద్రగారు. ఈ సినిమాలోకోర్ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. నాకు రిలేటెడ్‌గా ఉండే పాయింట్ కూడా. ఇలాంటి స్పెషల్ మూవీని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. శరత్‌గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. నా నువ్వే .. సాంగ్ నాకు బాగా నచ్చింది. మహేశ్, కిరణ్, విజయ్‌గారు మంచి సపోర్ట్ అందించారు. వారి వల్లే బెస్ట్ మూవీ వచ్చింది. రామజోగయ్యగారు, అనంత శ్రీరామ్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. కల్యాణ్ రామ్ లేకుంటే ఈ సినిమాను పూర్తి చేసే దాన్ని కాదు. మోస్ట్ సపోర్టివ్ కోస్టార్. తన డేడికేషన్ లెవల్స్ మరో స్థాయిలో ఉండటాన్ని గమనించాను.
అన్నారు.
డైరెక్టర్ జయేంద్ర మాట్లాడుతూ - మ్యూజిక్ డైరెక్టర్ శరత్ వండర్‌ఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. పాటలు విన్నవారందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్‌గారు ఎక్సలెంట్ లిరిక్స్ అందిస్తే.. బృందగారు కొరియోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. కల్యాణ్ రామ్ రొమాంటిక్ జోనర్‌లో నటించడానికి కారణం నాపై తను ఉంచిన నమ్మకమే. తమన్నా ఓ కొత్త హీరోయిన్‌లా నటించింది. మహేశ్‌గారు, కిరణ్‌గారు, విజయ్‌గారికి అభినందనలు. కూల్, బ్రిజీ ఎంటర్‌టైనింగ్ మూవీ
అన్నారు.
సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ - కల్యాణ్ రామ్, తమన్నా, జయేంద్ర, శరత్, మహేశ్ కోనేరు ఇలా ఒక వండర్‌ఫుల్ టీంతో పనిచేసే అవకాశం కలిగింది. జయేంద్రగారి బెస్ట్ ఫిలిమ్‌గా నిలిచిపోతుంది. ఇందులో లవ్ మ్యాజిక్‌ను చూస్తారు. టీంకు ఆల్ ది బెస్ట్
అన్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు మాట్లాడుతూ - సినిమా ఇండస్ట్రీలో పదేళ్లుగా జర్నీ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులకు థాంక్స్. శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారి వద్ద నా జర్నీ ప్రారంభమైంది. తర్వాత ఆర్కా మీడియా, తర్వాత ఎన్టీఆర్‌గారు, కల్యాణ్ రామ్‌గారు, హరిగారు ఇలా అందరితో పని చేసే అవకాశం కలిగింది. తొలి సినిమానే అయినా కల్యాణ్ రామ్‌గారు నమ్మకంతో సినిమా చేశారు. తారక్‌గారు, కల్యాణ్‌రామ్‌గారు, హరిగారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. ఈ సినిమా గురించి చెప్పడం కంటే తెరపై చూస్తే అర్థమవుతుంది. జయేంద్రగారు, పి.సి.శ్రీరాంగారు మంచి విజువల్ ఫీస్ట్ అందించారు
అన్నారు.
ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం, ఆర్.జె.వింధ్య, బాబ్జీ, హేమంత్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.