Social News XYZ     

FAAS Film Society – Dasari’ Lifetime Achievement Award Was Presented To Senior Journalist B.A.Raju

Film Analytical And Appreciation Society (FAAS) is popular for it's services to Film Industry since many decades. Awards Presentation Ceremony of FAAS - Dasari 2018 Film Awards was held on May 6th at Sri Tyagaraya Gana Sabha, Hyderabad. Society Chief Secretary, Ex-Censor Board Member Dr K.DharamaRao presided the Award Presentation Ceremony.

FAAS - Dasari Silver Crown awards were presented to Director Kodi Ramakrishna and Renowned TV personality Suma Kanakala.

Dasari Life Time Achievement Award was presented to Editor and Publisher of Superhit Film Weekly, Superhit Films PRO, Popular Producer B.A.Raju.

 

On this occasion, B.A.Raju says," I am very happy to be honored with this award which is named after Dasari garu. I Thank committee for honoring me with this award. I also Thank my Family, Film Industry, Fellow Jourlanists for their support. I congratulate fellow awardees."

Director Of The Year award to Sekhar Kammula for Fidaa, Best Lyricist award to Suddala Ashok Teja, Best Singer Madhu Priya, Special Appreciation award To Director Vaddepalli Krishna for Lavanya With Loveboys. Dasari Talented Awards was presented to Sampoornesh Babu, Sivaparvathy, Music Director Vasu Rao, Dialogue Writer Sanjeevi, Dasari Special Service Award was presented to Redcross Society President Lion Dr. A.Nataraj. Many film celebrities graced the event with their presence.

సీనియర్ జర్నలిస్ట్ బి.ఎ.రాజు కి 'ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి' లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రధానం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేశారు. సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్‌ బోర్డు సభ్యులు డా|| కె.ధర్మారావు ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

ఫాస్‌ - దాసరి కీర్తి కిరీట సిల్వర్‌ క్రౌన్‌ అవార్డులను దర్శకులు కోడి రామకృష్ణ, టి.వి. రంగ సుప్రసిద్ధులు సుమ కనకాలకు అందజేశారు.

దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్‌ సినీ వారపత్రిక ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌, సూపర్‌హిట్‌ చితాల్ర పి.ఆర్‌.ఓ, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు అందుకున్నారు.

అవార్డు అందుకున్న బి.ఎ.రాజు మాట్లాడుతూ," దాసరి గారి పేరు మీద పెట్టిన ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అవార్డు ఇచ్చి గౌరవించిన కమిటీ కి, సహాయ, సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకి, సినిమా పరిశ్రమ కి, తోటి జర్నలిస్ట్ మిత్రులకీ కృతజ్ఞతలు. ఈ వేదిక మీద అవార్డు అందుకుంటున్న తోటి అవార్డు గ్రహీతలకు అభినందనలు".

ఇతర అవార్డులు డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌(ఫిదా) శేఖర్‌ కమ్ముల, ఉత్తమ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ(లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి అందుకోగా, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు లయన్‌ డా. ఎ.నటరాజుకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Facebook Comments
FAAS Film Society - Dasari' Lifetime Achievement Award Was Presented To Senior Journalist B.A.Raju

About uma