Tik Tik Tik to release on June 22nd

జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న చిత్రం టిక్ టిక్ టిక్‌. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రంలో తొలి అంత‌రిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్క‌డం విశేషం. జూన్ 22న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా... ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ - ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు చూసిన సినిమాకు భిన్నంగా రూపొందిన సినిమా `టిక్ టిక్ టిక్‌`. అంత‌రిక్ష నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ ఇది. సినిమా చూసే ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతారు. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ఆల్ రెడీ విడుద‌లైన ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. `బిచ్చ‌గాడు` సినిమాను తెలుగులో విడుద‌ల చేసిన‌ప్పుడు ఇక్క‌డ ప్రేక్ష‌కులు ఎంత‌గానో మ‌మ్మ‌ల్ని ఆద‌రించారు. త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో చేసిన థ్రిల్ల‌ర్ మూవీ `16`ని కూడా ఆద‌రించారు. అలాంటి విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్ ఇది. ఇండియ‌న్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది అన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%