FAAS Film Society Dasari Cine Film Awards Held In A Grand Style

ఘనంగా ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల ప్రధానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేశారు. సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్‌ బోర్డు సభ్యులు డా|| కె.ధర్మారావు ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఫాస్‌ - దాసరి కీర్తి కిరీట సిల్వర్‌ క్రౌన్‌ అవార్డులను దర్శకులు కోడి రామకృష్ణ, టి.వి. రంగ సుప్రసిద్ధులు సుమ కనకాలకు అందజేశారు.

దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్‌ సినీ వారపత్రిక ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌, సూపర్‌హిట్‌ చితాల్ర పి.ఆర్‌.ఓ, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు అందుకున్నారు.

ఇతర అవార్డులు డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌(ఫిదా) శేఖర్‌ కమ్ముల, ఉత్తమ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ(లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి అందుకోగా, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు లయన్‌ డా. ఎ.నటరాజుకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%