Jamba Lakidi Pamba movie has a wonderful concept: Actor Nani

`జంబల‌కిడిపంబ‌` లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం జంబ ల‌కిడి పంబ‌. ఈ సినిమా టీజర్ ను హీరో నాని గురువారం హైదరాబాద్ లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీనివాస్‌రెడ్డి , నిర్మాతలు ర‌వి, జో జో జోస్‌ , ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ‌, స‌హ నిర్మాత బి.సురేశ్ రెడ్డి,లైన్ ప్రొడ్యూస‌ర్‌ స‌ంతోష్‌ సహా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా...
హీరో నాని మాట్లాడుతూ - " ఈవీవీగారి జంబల‌కిడిపంబ‌ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే ,అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా,సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది . ఇక శ్రీనివాస రెడ్డి చేస్తే తిరుగేముంది !నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ . నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే జంబల‌కిడిపంబ‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. జంబల‌కిడిపంబ‌ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను " అన్నారు.

హీరో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ - మా సినిమా టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది అన్నారు.

నిర్మాత ర‌వి మాట్లాడుతూ - శ్రీనివాస్ రెడ్డిగారు హీరోగా న‌టించిన ఈ చిత్రం టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వ‌స్తుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ - ```జంబ ల‌కిడి పంబ‌సినిమా క‌ల్ట్ మూవీ. ఇందులోజంబ ల‌కిడి పంబ‌` అనే ప‌దానికి అర్థం లేదు. కానీ అదే టైటిల్‌గా పెట్టిన ఈ సినిమాతో ఈవీవీగారు కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్ప‌టి సినిమాకు.. ఇప్పుడు మేం చేసిన సినిమాకు సంబంధం లేదు. క‌థ‌కు సూట్ అవుతుంద‌నిపించి ఈ టైటిల్‌ను పెట్టాం`` అన్నారు.

న‌టీన‌టులు:
పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ ,స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%