Naga Shaurya’s Ammamagarillu movie begins DTS mixing work

డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల్లో `అమ్మ‌మ్మ‌గారిల్లు`

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. యూ ట్యూబ్ లో టీజ‌ర్ దూసుకుపోతుంది. నేటి జ‌నులంతా తమ బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. అలాగే మేడే సంద‌ర్భంగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి వివేష స్పంద‌న ల‌భిస్తోంది. పలువురు సినీ పెద్ద‌లు కూడా టీజ‌ర్ చూసి ఎంతో బాగుంద‌ని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగిపోతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%