Social News XYZ     

Nayantara Starrer Titled Lady Tiger

"లేడీ టైగర్"గా
లేడీ సూపర్ స్టార్!!

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన "ఎలెక్ట్ర" చిత్రం తెలుగులో "లేడీ టైగర్" పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై.. సి.ఆర్.రాజన్ సమర్పణలో.. సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత.

శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మనీషా కొయిరాలా ముఖ్య పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బిజూ మీనన్ మరో ముఖ్య పాత్రధారి.

 

రాజశేఖర్ రెడ్డి మాటలు, వెనిజండ్ల శ్రీరామ్మూర్తి పాటలు అందించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

నిర్మాత సురేష్ దూడల మాట్లాడుతూ.. 'లేడీ సూపర్ స్టార్ నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ ల నటన 'లేడీ టైగర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే సెన్సార్ చేయించి, విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు!!

Facebook Comments
Nayantara Starrer Titled Lady Tiger

About uma