హాలీవుడ్ చిత్రాల్ని మరిపించేలా అత్యద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రం సంజీవని మే నెలాఖరున విడుదల
గాల్లో ఎగిరే బల్లులు, తెలివైన కోతులు, పది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెరపై కనిపించి మనల్ని వాటి నటనతో , యాక్షన్ తో అబ్బురపరిచాయంటే అది తప్పకుండా హాలీవుడ్ చిత్రమే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని ఈ సారి ఒక తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడబోతున్నాం.. ఇవన్నీ తెలుగులో నటించబోతున్నాయి. సమ్మర్ లో సినిమాలకి వచ్చే ప్రేక్షకుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య ఎక్కువుగా వుంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకుని జి.నివాస్ ప్రోడ్యూసర్ గా, రవి వీడే దర్శకుడి గా మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి, దాదాపు 1000 కి పైగా వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం సంజీవని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మే నెలాఖరున విడుదల కి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ.. ప్రపంచంలో రామాయణం బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చినా కూడా సుందరకాండ పర్వం అనేది మన సినీ పరిశ్రమకి కమర్షియల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క సుందరకాండ లోనే తెలివైన కోతులు, గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బురపరిచే యుద్ధాలు వుంటాయి. 6 సంవత్సరాల పిల్లల నుండి 60 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకూ ఆనందంతో ఉప్పొంగిపోయే సన్నివేశాలుంటాయి. అలాంటివి ఇప్పటి వరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రెండు సంవత్సరాలు, తెలుగులో మెషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి, దాదాపు 1000 కి పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనే కాకుండా కెనడా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత కష్టతరమైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చర్ అనే రేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మే నెలాఖరున 2018 లో వస్తున్న మొట్టమొదటి భారీ గ్రాఫిక్స్ చిత్రం గా చిన్న పిల్లల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే చిత్రం గా మా సంజీవని మొదటి స్థానంలో వుండబోతుంది. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత లు ప్రధాన పాత్రల్లో నటించగా శ్రవణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మా చిత్రాన్ని ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సమ్మర్ లో వచ్చే ప్రేక్షకులకి అబ్బురపరిచే విన్యాసాలతో.. ఆశ్చర్యపోయే వింతలతో.. అత్యంత ఉత్సుకతతో.. ఊహించని ఉత్సాహంతో మనసారా ఆస్వాదించే చిత్రంగా సంజీవని నిలబడుతుందని మా నమ్మకం.. అని అన్నారు
Starring: Manoj Chandra, Anurag Dev, Swetha Varma, Amogh Deshapathi, Mohan, Nitin.
VFX: RockstoriesVFX, Canada; Vector Visual Magic, Hyderabad
Mountaineering Stunts: Shekhar Babu
VFX Supervision: Devi
VFX Producer: Akhil Gummadi
Sound Design: Saketh Komanduri
Camera & Editing: Venkat
Music: Sravan KK
Producer: G.Nivas
Written & Directed By Ravi Vide
Worldwide Rights: Sri Lakshmi pictures
This website uses cookies.