James program album launched

"జెమ్స్" ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ఆల్బమ్ విడుదల కార్యక్రమం..

ఎస్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్. సమర్పణలో ఎస్ ఎన్ చిన్నా స్వీయ పరివేక్షణలో త్వరలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న కార్యక్రమం "జెమ్స్" ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ..ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా ఉదయభాను, న్యాయ నిర్ణేతలుగా శివ శంకర మాస్టర్, ప్రీతి జింగానియా లు కాగా,గీతా సింగ్, సుమన్ శెట్టి టీమ్ లీడర్స్ గా వ్యవహరించబోతున్నారు... ఈ షో కు సంబంధించిన ఆల్బమ్ సీడీని బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మరియు సెన్సేషన్ నటి శ్రీ రెడ్డి, రామ్మోహన్ లు విడుదల చేసారు.

అనంతరం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ షో ఆల్బమ్ సాంగ్స్ ను అందించిన సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మా బ్యానర్లో వచ్చే సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు... ఈ షో పాటలు చాలా బాగున్నాయి.. ఎస్ ఎన్ చిన్నా గుడ్ కొరియోగ్రాఫర్. రెండు నెలల క్రితం ఇదే వేదిక పై జెమ్స్ డాన్స్ షో ప్రోగ్రామ్ ను ఘనంగా అనౌన్స్ చేశారు.. ఇంతవరకు ఎవరూ చేయని ఈవెంట్ ను చేస్తున్నాడు చిన్నా.. టాలెంట్ ఉన్న కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన చిన్నా కు అంతా మంచే జరగాలని పెద్ద ఎత్తున మంచి పేరు సంపాందించాలని ఆశిస్తున్నా.. అలానే ఎంతో మంది స్టార్స్ రావాలని కోరుతున్నా... ఇందుకు మా నుంచి ఎలాంటి సహకరమైనా అందిస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నామన్నారు...

శ్రీ రెడ్డి మాట్లాడుతూ :-కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్లలోని టాలెంట్ ను బయటికి తీసుకు రావాలని చిన్నా గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అతన్ని అభినందిస్తున్నా... ప్రోగ్రామ్ పెద్ద విజయం సాధించాలని కోరుతున్నా అన్నారు...

సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ :-చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ అవుతుంది.. ఓల్డ్ సాంగ్స్ కు ఎవరైనా డాన్స్ లు వేస్తారు... అందుకే మేమే అన్నీ జోనర్స్ కలిగిన 144 పాటలను ఆల్బమ్ గా తయారు చేసి 10 రోజులకు ఒకసారి 10 పాటలను విడుదల చేయననున్నాము,పాటలు ఎంతబాగున్నాయో అంతే బాగా జెమ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది.. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్ ఎన్ చిన్నా గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు..

దర్శక -నిర్మాత :-ఎస్ ఎన్ చిన్నా మాట్లాడుతూ ఒక్కడితో మొదలైన ఈ జెమ్స్ ప్రోగ్రామ్ ప్రయాణం ఇప్పుడు నా వెనకాల ఇంతమంది నిలబడ్డారు ... నా స్నేహితులు గిరి, రాంబాబు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు... వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఎస్ ఎన్ అంటే మా పేరెంట్స్ నేమ్స్.. వారి పేరున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే తపనతోనే జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ను నిర్వహించడం జరుగుతోంది.. సరికొత్త టాలెంట్ ను పైకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే 128 డాన్సర్స్, 30 మెంబెర్స్ సింగెర్స్, 6 మెంబెర్స్ హీరోస్, 6 మెంబెర్స్ హీరోయిన్స్ ఈ రియాలిటీ షో కు సెలెక్ట్ అయ్యారు. ఇలా తెలుగు వారెందరో టాలెంట్ కలిగిన వారున్నారు వారందరికీ ఇదొక గొప్ప వేదిక. త్వరలో మరో 10 సాంగ్స్ తో ముందుకు వస్తాం అని చెప్పారు..

ఎస్ బి ఐ మ్యానేజర్ మూర్తి, సీనియర్ సింగర్ వేణు, డీఓపీ మురళి కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్, రైటర్ రామారావు, సింగర్స్ లహరి, శ్రావణి, కృష్ణ, గీతిక, రవి కిషోర్, రచిత, రేష్మి, చక్రధర్, అరుణ్, గాయత్రి, గౌతమ్, అంబిక, శ్రీనాథ్, కీర్తి,యాంకర్ సునితా వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%