“This year marks a milestone for the Marvel Cinematic Universe as it turns 10 and to add to the excitement, we are releasing Avengers: Infinity War – the biggest Super Hero crossover one has ever seen. There isn’t anything bigger, more exciting and thrilling in the Super Hero realm, with all the Avengers, The Guardians of the Galaxy and their allies coming together to defend the universe from Thanos, which itself proves just how powerful he is. Keeping with the anticipation around the movie, we are offering our fans in South India an opportunity to experience the grandeur of the movie in a language that they prefer. With Rana Daggubati coming on board as the voice of Thanos, we are confident of reaching out to a wider audience base while retaining the magnitude and staying true to the ethos of the Marvel brand,” said Bikram Duggal, Executive Director and Head, Studio Entertainment, Disney India.
Actor Rana Daggubati, who recently finished dubbing for the movie added, “I've grown up reading Marvel Comics and Marvel movies with their intricately woven story lines have been some of my favourite movies to watch. It is fascinating to see how Marvel has created characters and stories that resonate so well with audiences across the globe, making movies at a scale that one had never before imagined. Characters such as Iron Man and Captain America have been my favourites so dubbing for Avengers: Infinity War is a thrill! Voicing for Thanos, a villain so powerful that some of the biggest superheroes have a tough time dealing with, is an exciting experience!”
Disney India continues setting new standards for Hollywood in India. The studio had adopted a similar strategy for The Jungle Book in 2016, signing on a roster of A-List talent including Priyanka Chopra, Irrfan, Nana Patekar, Om Puri and Shefali Shah, to bring to life the famous characters in the Hindi version of Disney’s The Jungle Book. It was followed by roping in Varun Dhawan for Captain America in the movie Captain America Civil War. It wasn’t short of a casting coup! With a series of ground-breaking and unique localisation initiatives, these movies set new benchmarks and took over the box-office in India. Come April 27th, Disney is all set to take over the cinematic universe, yet again, with the phenomena that is Avengers: Infinity War.
About Marvel Studios’ Avengers: Infinity War:
An unprecedented cinematic journey of 10 years in the making and spanning the entire Marvel Cinematic Universe, Marvel Studios’ Avengers: Infinity War brings to the screen the ultimate, deadliest showdown of all time. The Avengers and their Super Hero allies must be willing to sacrifice all in an attempt to defeat the powerful Thanos before his blitz of devastation and ruin puts an end to the universe.
Anthony and Joe Russo direct the film, which is produced by Kevin Feige. The movie stars Robert Downey Jr., Chris Evans, Mark Ruffalo, Scarlet Johansson, Chris Hemsworth, Josh Brolin, Tom Hiddleston, Jeremy Renner, Chris Pratt, Elizabeth Olsen, Sebastian Stan, Benedict Cumberbatch, Paul Bettany, Cobie Smulders, Benedict Wong, Zoe Saldana, Karen Gillan, Vin Diesel, Dave Bautista, Bradley Cooper, Pom Klementieff, Peter Dinklage, Benicio del Toro, Tom Holland, Anthony Mackie, Chadwick Boseman, Danai Gurira, Paul Rudd, Don Cheadle, Letitia Wright, Winston Duke, Gwyneth Paltrow, Tessa Thompson and Angela Bassett amongst others.
Marvel Studios’ Avengers: Infinity War is set to release in India on the 27th of April, 2018 in English, Hindi, Tamil and Telugu in 2D, 3D and IMAX 3D formats.
"డిస్నీ ప్రెస్టీజియస్ మూవీ 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' సూపర్ విలన్ తానొస్ కి డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను" - 'భళ్ళాలదేవ' రానా దగ్గుబాటి
మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ 'డిస్నీ ఇండియా' ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గిర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' తెలుగు వెర్షన్ కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగం కానున్నారు. రానా 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' విలన్ తానొస్ కి డబ్బింగ్ చెప్పారు.
డిస్నీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ బిక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ, "ఈ ఏడాది తో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్', ఈ సందర్భంగా 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించుకుంది. ఇంత మంది సూపర్ హీరో లు ఒకే సినిమాలోకి తీసుకురావడంతో ఈ చిత్రం మీద ఆసక్తి, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలతో విశ్వ రక్షకులు, ఎవెంజర్స్ తమ సహచరులతో కలిసి తానొస్ తో పోరాటానికి సిద్ధమవుతున్నారు. చిత్రం మీద ప్రేక్షకులకి ఉన్న ఆసక్తి దృష్ట్యా అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని వీక్షకులు వారి వారి భాషల్లో ఆస్వాదించేందుకు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పుడు తానొస్ కి రానా దగ్గుబాటి గాత్రం అందివ్వడంతో, ఈ చిత్రం ప్రేక్షకులకి మరింత దగ్గిరవుతుంది అని నమ్ముతున్నాం."
ఇటీవలే డబ్బింగ్ చెప్పిన రానా దగ్గుబాటి మాట్లాడుతూ, " నేను మార్వెల్ కామిక్స్ ని చదువుతూనే పెరిగాను. సూపర్ హీరో ల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ ది తిరుగులేని స్థాయి. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్ గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోల ని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్ గా వినిపించడం మరిచిపోలేని ఎక్స్పీరియన్స్"
హాలీవుడ్ సినిమాలకి భారత్ లో కొత్త ఒరవడి సృష్టించడంలో డిస్నీ ఇండియా సిద్దహస్తులు. 2016 లో వచ్చిన 'జంగల్ బుక్' కి కూడా డిస్నీ ఇలాంటి వినూత్న ప్రణాళికతోనే ప్రేక్షకులకి ఆ చిత్రాన్ని మరింత దగ్గిర చేశారు. 'జంగల్ బుక్' కి టాప్ బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్, నానా పటేకర్, ఓం పూరి, షెఫాలీ షా వంటి వారితో ఆ చిత్రం లోని పాత్రకి డబ్బింగ్ చెప్పించారు. కెప్టెన్ అమెరికా - సివిల్ వార్ చిత్రంలో కెప్టెన్ అమెరికా కి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో గాత్రం ఇప్పించారు. మనకి తెలిసిన తారల గాత్రం వల్ల ఆ చిత్రాలు ప్రేక్షలకి మరింత దగ్గిరయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయం సాధించాయి. ఈ ఏప్రిల్ 27 న విడుదల కానున్న 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి కూడా ఇదే ప్రణాళిక ఎంచుకున్న డిస్నీ మరోసారి జయకేతనం ఎగరేయడం ఖాయం.
10 సంవత్సరాలుగా ప్రణాళికాబద్దంగా భారీ చిత్రాలని నిర్మించుకుంటూ వస్తున్న 'మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్', ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ చిత్రం తో ఇంతకముందెన్నడు చూడని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు తమ చిత్రాలన్నింటిలో కనిపించిన సూపర్ హీరో లు అందరూ ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్ విలన్ తానొస్ తో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ అద్భుతం ఏప్రిల్ 27 న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో 2D 3D IMAX 3D ల లో వెండితెర పై ఆవిష్కృతం కానుంది.
This website uses cookies.