Bharat Ane Nenu (The Song Of Bharat) lyrical song released

'విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం...భరత్‌ అనే నేను.. హామీ ఇస్తున్నాను..'
సూపర్‌స్టార్‌ మహేష్‌ 'భరత్‌ అనే నేను' మొదటి పాట విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.

'విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం.. నలుపెరుగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతం,..భరత్‌ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. బాధ్యుడ్నై ఉంటాను.. ఆఫ్‌ ద పీపుల్‌, బై ద పీపుల్‌, ఫర్‌ ద పీపుల్‌ ప్రతినిధిగా.. దిస్‌ ఈజ్‌ మి' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్‌ వీనుల విందైన సంగీతం తోడైంది. సంగీతం, సాహిత్యం సమపాళ్ళలో కుదిరిన ఈ పాటను డేవిడ్‌ సైమన్‌ అంతే అద్భుతంగా ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, విజన్‌ ఆఫ్‌ భరత్‌ టీజర్‌లకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈరోజు విడుదలైన మొదటి పాటతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%