Gopichand’s Pantham movie first look released

Young and aggressive hero Gopichand is ready with his next film, Pantham, a production Sri Satya Sai Arts banner by KK Radhamohan. With the tagline ‘For a cause’, the film is the directorial debut of well-known screenwriter K. Chakravarthy who has written earlier for Balupu, Power and Jai Lava Kusa.

This film is a milestone one for Gopichand, marking his 25th release. The first look of the film was released recently and to mark the occasion, producer KK Radhamohan said, “It is quite a happy moment for us, as a production house, to be associated with Gopichand’s landmark film. We have completed 60 per cent of the film’s shoot. Director Chakravarthy has come up with a wonderful story that will be high on the commercial elements. Even for the actor, this will be a new look as never seen before. We are happy with the response to the response to the first look. Mehreen will be seen in a very good role in the film. Gopi Sunder’s music and Prasad Murella’s camerawork will be assets to the film. I appreciate the support of the rest of the cast and crew and it is only because of them all that we are going ahead on schedule and plan to release the film this summer.”

The film that stars Gopichand, Mehreen, Prudhvi and Jayaprakash Reddy in key roles has art director by AS Prakash. Dialogues: Ramesh Reddy; Screenplay: K. Chakravarthy and Bobby (K.S. Ravindra); Co-director: Bellamkonda Satyam Babu; Music: Gopi Sundar; DOP: Prasad Murella; Producer: KK Radhamohan; Direction: K Chakravarthy aka Chakri

గోపీచంద్ `పంతం` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఆంధ్రుడు, య‌జ్ఞం, ల‌క్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం పంతం. ఫ‌ర్ ఎ కాస్‌ ఉప శీర్షిక‌. బ‌లుపు, ప‌వ‌ర్‌, జై ల‌వకుశ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది కావ‌డం విశేషం. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా `పంతం`ను మా బ్యాన‌ర్‌లో చేయ‌డం హ్యాపీగా ఉంది. అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సినిమాలో 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాం. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను ద‌ర్శ‌కుడు చ‌క్రి చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని స్టైలిష్ లుక్‌లో గోపీచంద్‌గారు క‌న‌ప‌డ‌తారు. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. అలాగే మెహ‌రీన్ చాలా మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. గోపీ సుంద‌ర్ సంగీతం, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌పీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. మిగిలిన న‌టీనటులు, సాంకేతిక నిపుణులు స‌హ‌కారంతో సినిమాను అనుకున్న‌ట్లు పూర్తి చేసి ఈ వేస‌విలో విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%