Manasainodu Movie to release on March 17th

మార్చి17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “మనసైనోడు” చిత్రం

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా హెచ్. పిక్చర్స్ పతాకం పై హస్సేబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని  దర్శకుడిగా పరిచయం చేస్తు నిర్మించిన చిత్రం “మనసైనోడు”. ఇటీవల ఈ చిత్రo సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. యువతీ యువకులు  స్నేహంలో ఉన్నప్పుడు, ప్రేమ లో ఉన్నప్పుడు వాళ్ళ మద్య జరిగే భావోద్వేగాలను కధలో జోడించి,మంచి మెసేజ్ పాటు  దేశభక్తిని యువకుల్లో కలిగే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం “మనసైనోడు” అని నిర్మాత  తెలిపారు.ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విదంగా రూపుదించమని దర్శకుడు తెలియజేశారు.

ఇంకా ఈ చిత్రం లో పోసానికృష్ణమురళీ,రఘుబాబు,గిరిబాబు, కేదార్ శంకర్,గుర్రాజు,వేణుగోపాల్,అనంత్,చేతన్య,శశాంక, సంగీత, మధుమని, జ్యోతి,దివ్యశ్రీగౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్: సుభాష్ ఆనoద్, పాటలు: డా.సి. నారాయణ రెడ్డి,భాస్కరబట్ల,గోసాల రాంబాబు,పూర్ణచారి నిర్మాత: హసీబుద్దిన్, కధ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%