విజయ్ దేవరకొండ, కె.ఇ. జ్ఞానవేల్‌రాజా, ఆనంద్ శంకర్ చిత్రం పేరు 'నోటా'
విజయ్ దేవరకొండ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు' ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం. 14 చిత్రానికి 'నోటా' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం: సి.ఎస్. శ్యాం, కెమెరా: శాంత, ఆర్ట్: కిరణ్, కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య, దర్శకత్వం: ఆనంద్‌శంకర్, నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్ రాజా.
This website uses cookies.