The Vision of Bharat from Bharat Ane Nenu released

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'భరత్‌ అనే నేను' టీజర్‌ విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 'విజన్‌ ఆఫ్‌ భరత్‌' పేరుతో మార్చి 6న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది.

పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. టీజర్‌లోని విశేషాల్లోకి వెళ్తే మహేష్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. ''చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. 'ఒకసారి ప్రామిస్‌ చేసి, ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌' అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చెయ్యాల్సిన రోజు ఒకటొచ్చింది. పెద్దదే కాదు, కష్టమైంది ూడా. కానీ, ఎంత కష్టమైనా ఆ మాట ూడా తప్పలేదు. బికాజ్‌ ఐ యావ్‌ు ఎ మ్యాన్‌. వియ్‌ ఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళకీ భయం, బాధ్యత ఉండాలి... ప్రామిస్‌'' అంటూ మహేష్‌ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఈ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' తరహాలోనే ఈ సినిమాలో ూడా మంచి సందేశం ఉండబోతోందన్నది అర్థమవుతోంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%