Social News XYZ     

PrabhuDeva’s movie Gulaebaghavali to release on March 16th in Telugu

PrabhuDeva's movie Gulaebaghavali to release on March 16th in Telugu

ప్రముఖ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా హీరోగా, హాన్సిక హీరోయిన్‌గా, ప్రముఖ నటి రేవతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు.

మార్చి 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను ఆయన తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది. మార్చి 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

 

ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

Facebook Comments
PrabhuDeva's movie Gulaebaghavali to release on March 16th in Telugu

About uma