The First Look of 'Dandupalyam-4' was launched on Wednesday by hero Srikanth.
Srikanth said, "I am happy for the entire team. The first two parts were really hard to make. And we all know what kind of big hits they were in Karnataka. Many suggest to me that I should do sequels to my hits like 'Pelli Sandadi' and 'Mahatma'. But it didn't happen. In the case of Dandupalyam, not four but much more can be done because of the nature of the subject. I wish the team all the best."
Producer Venkaat said, "The craze for the brand Dandupalyam has only increased over the years. The director of the first three parts was someone else. Even though the audience didn't know much about the director and the artists, they lapped up the first part in a big way. Our efforts didn't go waste. The brand has stood the test of time. People remember the first part to this day. As for 'Dandupalyam-4', our director KT Nayak garu is a very intelligent person. As a technician, he is special. He is a hard-worker and a lover of the crime genre. The craze for the second part was more than that for the first part, just as is the case with the 'Baahubali' movies. But in Telugu, the second part couldn't be as great as the first one. We are keeping this in mind and are going to work extra hard on the fourth part. The film will be shot from March 8 onwards."
The producer added that the element of criminal gangs and police investigations is like an ocean that can be explored repeatedly. "The story of 'Dandupalyam-4' is not entirely imaginary. The basic story is inspired by real events. The film tells the story of a new gang and an old gang. It's commercial, unlike the first three movies," he adds.
Director KT Nayak said, "As the producer said, I love the crime genre a lot. Although people tell me I look very soft, I can make a raw film. I will do the talking after we shoot the movie."
To be produced on Venkaat Movies, the film will star Makarand Deshpande, Pooja Gandhi, Ravi Kale, Petrol Prasanna, Muni, Jaya Deva, Karisubbu, Ravi Shankar, Sneha, Sanjeev, Arun Bachchan, Somu, etc.
వెంకట్ మూవీస్ బ్యానర్‌పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం దండుపాళ్యం 4
. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ - దండుపాళ్యం పార్ట్ 1, పార్ట్2లను తెలుగు ప్రజలు ఆదరించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం. దండుపాళ్యంపై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు దండుపాళ్యం 3కి డైరెక్టర్ ఎవరనేది తెలియదు. ఆర్టిస్టుల గురించి పెద్దగా తెలియదు. ప్రేక్షకుల ఆశీర్వాదం, నా కృషితో రెండు సినిమాలు ప్రజలకు బాగా రీచ్ అయ్యాయి. దర్శకుడు కె.టి.నాయక్ మంచి ఇంటెలిజెంట్.. హార్డ్‌వర్కర్. ఈయనకు క్రైమ్ జోనర్‌లో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఆయన ఎలా దండుపాళ్యం 4 చేయవచ్చో చెప్పిన తీరు నాకు నచ్చింది. దండుపాళ్యం, బాహుబలి రెండు సినిమాల రేంజ్ వేరైనా ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌కి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యాయి. కొందరి వ్యక్తిగత అహాల కారణంగా దండుపాళ్యం 2 నేను అనుకున్నట్లుగా రాలేదు. ఆడియెన్స్‌ను ఏమైతే సినిమాలో ఉండాలనుకుని థియేటర్‌కి వచ్చారో అది సినిమాలో లేదు. దాంతో ఓ కసితో దండుపాళ్యం 4ను స్టార్ట్ చేశాను. పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో సినిమాను స్టార్ట్ చేస్తున్నాం. మార్చి 8న సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దండుపాళ్యం4 లో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొదటి మూడు పార్ట్స్‌లో నటించిన నటీనటులతో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో కనపడుతుంది. దండుపాళ్యం రీసెర్చ్‌లో మాకు దొరికిన సమాచారంతో పది సీక్వెల్స్ తీయవచ్చు. నిజమైన ఘటనను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది
అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ - నేను నిజామాబాద్ ఆర్మూర్‌లో పుట్టి పెరిగాను. కానీ తమిళనాడు, కర్ణాటకల్లో స్థిరపడ్డాను. నాకు ఇచ్చిన పనిని 100 శాతం నేరవేరుస్తాను. ప్రొడ్యూసర్‌గారికి థాంక్స్. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ఈ సీక్వెల్ ఉంటుంది
అన్నారు.
వోల్గా బాబ్జీ మాట్లాడుతూ వెంకట్‌గారికి అతని టీంకు అభినందనలు
అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - నా సినిమాల్లో కూడా మహాత్మ 2. పెళ్లి సందడి 2 వంటి సినిమాలు చేయాలని చాలా మంది అనుకున్నారు కూడా. ఇక దండుపాళ్యంకు ఉన్న క్రేజ్ తెలిసింది. ముందు విడుదలైన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించాయో అందరికీ తెలిసిందే. ఇందులో విషయాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని పార్టులైనా షూటింగ్ చేయవచ్చు. నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా చేసిన సినిమాలు ఇవి. దండుపాళ్యం 4 పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను
అన్నారు.
నటీనటులు:మకరంద్ దేశ్ పాండే, పూజాగాంధీ,రవికాలే,పెట్రోల్ ప్రసన్న,ముని,జయదేవ,కరిసుబ్బు,రవిశంకర్, స్నేహ, సంజీవ్, అరుణ్ బచ్చన్, సోము తదితరులు.
ఈ చిత్రాణికి కెమెరా: ఆర్.గిరి, ఆనంద్ రాజా విక్రమ్, ఎడిటర్: బాబు.ఎ.శ్రీవాత్సవ, ప్రీతి మోహన్; నేపధ్య సంగీతం: అర్జున్ జన్య,
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి. నాయక్