Social News XYZ     

Nandikonda Vagullona movie audio released

'నందికొండ వాగుల్లోన' ఆడియో విడుదల

Nandikonda Vagullona movie audio released

బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పై సాయి వెంకట్ ప్రెసెంట్స్ నందికొండ  వాగుల్లోన. షఫీ, లక్కీ ఎకారి సాయి కిరణ్, పూజశ్రీ, మేఘన మరియు జ్యోతిక యాదవ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రానికి దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత రఘు హెచ్. లహరి మ్యూజిక్ ద్వారా   ఈచిత్ర ఆడియో   మరియు ట్రైలర్ లాంచ్ లను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు.. ట్రైలర్ ను శివారెడ్డి చేయగా, ఆడియో బిగ్ సీడీని ఎర్రల్ల శ్రీనివాస్ విడుదల చేసారు.  ఈ వేడుకలో ఎమ్ ఎల్ ఎ శ్రీనివాస్ గౌడ్, ఎర్రల్ల శ్రీనివాస్, సాయి మధుసూదన చారి, గట్టు రామచంద్ర రావు, ఆర్ కె గౌడ్, సత్యానంద్, రాధా ప్రశాంత్, హనుమంత రావు, కమెడియన్ శివారెడ్డి, రష్మీ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు..

 

దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమా అని అనుకోకండి ఇందులో ఎంటర్త్సైన్మెంట్ చాలా ఎక్కువ గా ఉంది. తప్పకుండా ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా  అన్నారు. నిర్మాత రఘు మాట్లాడుతూ కష్టపడి పని చేసాము.. నవీన్, భాష లు ఈ సినిమా చేయడానికి ప్రోత్సహించారు.. ఇక సాయి వెంకట్, ఆర్ కె గౌడ్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.. అందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా అన్నారు.

సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ హీరో షిరాజ్ తో ఉన్న స్నేహం కొద్దీ ఈ సినిమాను సమర్పించడం జరుగుతోంది.. అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న దానికంటే కాస్త ఎక్కువగానే టెమ్టేషన్స్ ఇందులో ఉన్నాయి. అలానే పూర్తి ఎంటర్త్సైన్మెంట్ గా సాగుతుంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లలో బాగా అడుతుందని నమ్ముతున్నాం..200 థియేటర్సలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా  చిత్ర యూనిట్ కు సపోర్ట్ గా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం అని అన్నారు. ముందు మార్చ్ 2న విడుదల చేయాలనుకున్నాం కానీ బంద్ కారణంగా పోస్ట్ పోన్డ్ చేసుకున్నాం.. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తామని తెలుపారు మరో సమర్పకుడు షిరాజ్.

షఫీ, లక్కీ ఎకారి సాయి కిరణ్, పూజశ్రీ, మేఘన మరియు జ్యోతిక యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: నవనీత్, లిరిక్స్: భాస్యశ్రీ, స్టోరీ: ఆర్చన్ ఎంటర్త్సైన్మెంట్స్, కెమెరా-ఎడిటింగ్-డైరెక్షన్: సత్యనారాయణ ఎకరి, ప్రొడ్యూసర్: రఘు హెచ్.

Facebook Comments
Nandikonda Vagullona movie audio released

About uma