Social News XYZ     

Telangana Film Chamber extends their support for Theaters strike from March 2nd

మార్చి 2 నుండి థియేట‌ర్స్ బంద్ కు మేము మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్నాం-టిఎఫ్ఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్

Telangana Film Chamber extends their support for Theaters strike from March 2nd

నిర్మాత‌ల‌కు...డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ క్యూబ్, యుఎఫ్ ఓ, పిఎక్స్ డి  సంస్థ‌ల‌కు మ‌ధ్య  శుక్ర‌వారం బెంగుళూరులో జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో నాలుగు భాష‌ల చిత్ర నిర్మాత‌లు ఒకే తాటి పైకొచ్చి మార్చి 2 నుంచి థియేట‌ర్స్ బంద్  చేస్తూ ఆ మూడు డిజిట్ సంస్థ‌ల‌కు సినిమా కంటెంట్ ఇవ్వ‌కూడద‌ని  నిర్ణ‌యించారు.

 

దీనికి తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌ర‌పున మేము కూడా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్నాంఅన్నారు <strong><span style="color: #ff0000;">టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌</span></strong>. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ... గ‌త ప‌దేళ్లుగా డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌పై   మేము పోరాటం చేస్తున్నాం. ఇప్ప‌టికైనా ముందుకొచ్చి  సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఇండస్ర్టీ అంతా డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేయటం మంచి ప‌రిణామం. గ‌తంలో మేము డిజిట‌ల్ రేట్ల‌ను త‌గ్గించాలంటూ నిర‌హార దీక్ష చేయ‌డం కూడా జ‌రిగింది. కానీ అప్ప‌ట్లో పెద్ద‌గా ఎవ‌రూ దీన్ని ప‌ట్టించుకోలేదు. కొంత మందికైతే డిజిట‌ల్ రేట్ల పై అంత అవ‌గాహ‌న కూడా ఉండేది కాదు.  శుక్రవారం బెంగుళూరు జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఆ మూడు డిజిట‌ల్ స‌ర్వీస్ సంస్థ‌లు వారు 9శాతానికి మించి త‌గ్గించే ప్ర‌స్త‌కే లేద‌ని తేల్చి చెప్పారు.  అస‌లు డిజిట‌ల్ ఛార్జెస్ ఐదేళ్లుకు మించి ఉండ‌కూడదు. ప‌ద‌మూడేళ్లైనా కూడా అదే రేట్లు తీసుకుంటూ నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెడుతున్నారు. మ‌న సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ర్టీల‌లో త‌ప్ప  హాలీవుడ్, బాలీవుడ్ లలో ఈ విధంగా లేదు. గ‌తంలో 2500లకే  డిజిట‌ల్ స‌ర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తామంటూ  కొన్ని సంస్థ‌లు ముందుకొచ్చినా కానీ, వారిని రానివ్వ‌కుండా చేశారు కొంత మంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ అత్య‌ధిక‌ రేట్ల వ‌ల్ల రిలీజ్ కాకుండా ఎన్నో చిత్రాలు ఆగిపోయాయి.  క్యూబ్, యుఎఫ్ ఓ, పిఎక్స్ డి సంస్థ‌ల‌తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే త‌క్కువ రేట్ల‌కే డిజిటల్ స‌ర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటూ అనేక సంస్థ‌లు ముందుకొస్తున్నాయి. కాబ‌ట్టి మార్చి 2 నుంచి థియేట‌ర్స్ బంద్ కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

టిఎఫ్‌సిసి సెక్ర‌ట‌రి సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...చానాళ్లుగా డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌పై మేము ఉద్య‌మం చేస్తూ వ‌చ్చాం. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఇండస్ర్టీ అంతా ఏక‌మై ఆ మూడు డిజిట‌ల్ సంస్థ‌లు దిగి వ‌చ్చేలా మార్చి 2 నుంచి చేయ‌బోతున్న థియేట‌ర్స్ బంద్ కు మా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తున్నాం. అంతా దీనికి స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నా. దీన్ని ముందుండి న‌డిపిస్తున్న‌ జెమిన్ కిర‌ణ్ గారికి డి.సురేష్ బాబు గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా అన్నారు.

Facebook Comments
Telangana Film Chamber extends their support for Theaters strike from March 2nd

About uma