Naga Shaurya, Sai Pallavi’s movie Kanam’s first single Sanjali will be out Feb 25th at 4 pm

ఫిబ్రవరి 25న నాగశౌర్య, సాయిపల్లవి, లైకా ప్రొడక్షన్స్‌ 'కణం' మొదటి సింగిల్‌

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నాగశౌర్య చేస్తున్న విభిన్న కథా చిత్రమిది. అలాగే 'ఫిదా' హీరోయిన్‌ సాయిపల్లవి ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం మొదటి సింగిల్‌ 'సంజలి..'ను ఆదివారం విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ''ఇది చాలా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఒక గొప్ప పాయింట్‌ ఇందులో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి సింగిల్‌ 'సంజలి..'ను ఆదివారం విడుదల చేస్తున్నాం'' అన్నారు.

నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%