సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో
శ్రీదేవి మూవీస్ చిత్రం టైటిల్ `సమ్మోహనం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రానికి సమ్మోహనం
అనే పేరును ఖరారు చేశారు. గురువారం సాయంత్రం 4.41గంటలకు టైటిల్‌ను ప్రకటించారు.
చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ సమ్మోహనం అంటే మంత్రముగ్ధులని చేసే ఒక అందమైన ఆకర్షణ. ఒక మ్యాజికల్ ఎట్రాక్షన్. మా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య సమ్మోహనకరమైన రొమాన్స్ ఉండటంతో పాటు మిగతా పాత్రలకి ఉండే విభిన్నమైన ఆకర్షణలు మెప్పిస్తాయి. ఓ కొత్త పోకడ ఉన్న నవతరం ప్రేమకథా చిత్రంగా ఉంటూనే ఆద్యంతం హాస్యం, సజీవమైన కుటుంబ బంధాలు, ఉద్వేగ భరిత సన్నివేశాల సమాహారంగా `సమ్మోహనం` తెరకెక్కుతోంది
అని అన్నారు.
చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కథకు యాప్ట్ గా ఉండేలా `సమ్మోహనం` టైటిల్‌ని ఖరారు చేశాం. ఇప్పటి వరకూ మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి మార్చి 3 వరకు నాలుగో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. దాంతో 80 శాతం షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3 వరకూ హిమాచల్ ప్రదేశ్, ముంబైలో షూటింగ్ చేస్తాం. `పెళ్లిచూపులు` ఫేమ్ వివేక్ సాగర్ మంచి సంగీతాన్నిచ్చారు. పీజీ విందా కెమెరా సినిమాకు హైలైట్ అవుతుంది. ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్. ప్రేమ, వినోదం ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి. పూర్తి స్థాయి టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిస్తున్నాం. మే మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం
అని అన్నారు.
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, వి.కె.నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ నందు, అమిత్ పురోహిత్, కాదంబరి కిరణ్, హరితేజ, కేదార్ శంకర్, శిశిర్ శర్మ, అభయ్, హర్షిణి, బిగ్ ఎఫ్.ఎం.క్రిష్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్‌ఖాన్, కె.రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్‌కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్; నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.