మలయాళ బ్లాక్ బస్టర్ `ఆనందం`.. ఇప్పుడు తెలుగులో!
కాలేజీ నేపథ్యంలో కథలు అల్లుకుని యువత మనసులకు హత్తుకునేటట్టు తెరకెక్కించిన ప్రతిసారీ విజయం తథ్యం. మలయాళ చిత్రం ఆనందం
ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. రూ.4కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూలు చేసింది. ఆహ్లాదకరమైన కథతో, భారీ విజయంతో యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ ఆనందం
చిత్రం అదే పేరుతో ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో అనువదిస్తున్నారు. గణేశ్ రాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కేరళ టాప్ హీరో ప్రేమమ్
ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన వాళ్లందరూ కొత్తవారే కావడం గమనార్హం. వీర వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు ఈ చిత్రానికి సమర్పకులు.
ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్మాట్లాడుతూ ```ఆనందంసినిమా కేరళలో చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన ఖర్చుకు నాలుగింతలు వసూళ్లు రాబట్టిందంటేనే ఆ సినిమా స్టామినాను అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నిర్మాతలు తెలుగు రైట్స్ కోసం పోటీపడ్డారు. అయినా విపరీతమైన పోటీని తట్టకుని మేం హక్కులు పొందాం. ఆ తర్వాత కూడా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా మంది మమ్మల్ని సంప్రదించారు. ఓ పెద్ద సంస్థకు చెందిన నిర్మాత ఫ్యాన్సీ ప్రైజ్ కూడా ఆఫర్ చేశారు. కానీ, తెలుగు నేటివిటీకి సరిపోయే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండటంతో మేం అనువాదం చేయాలనే నిర్ణయించుకున్నాం. ఇందులో
ప్రేమమ్ఫేమ్ కేరళ టాప్ హీరో నివిన్ పాల్ తప్ప, మిగిలిన వాళ్లందరూ కొత్తవారే నటించారు. తెరమీద వారిని చూస్తున్నంత సేపు చాలా నేచురల్‌గా ఉంటుంది. ఎక్కడా ఓవర్ డ్రామా, మెలో డ్రామా, సినిమాటిక్ డ్రామా కనిపించదు. తప్పకుండా యువతకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇందులో ఉన్న ఇండస్ట్రియల్ టూర్.. నాలుగు రోజుల్లో ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. మూడు లవ్ స్టోరీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరక్టర్ సచిన్ వారియర్ వినసొంపైన సంగీతాన్ని సమకూర్చారు. వినకొద్దీ వినాలనిపించేలా ఉన్నాయి బాణీలు. మార్చి మొదటి వారంలో పాటల్ని విడుదల చేస్తాం. 16న సినిమాను విడుదల చేస్తాం. మన
హ్యాపీడేస్`ని మరిపించే సినిమా అవుతుంది`` అని చెప్పారు.
అరుణ్ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, సిద్ధి మహాజనకట్టి, అన్ను ఆంటోని, అనార్కళి మరికర్, నివిన్ పాల్, రెంజి ఫణిక్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖర రెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: సచిన్ వారియర్, కెమెరా: ఆనంద్. ఇ. చంద్రన్, సహ నిర్మాతలు :వీర వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి , దర్శకత్వం: గణేశ్ రాజ్, సమర్పణ: ఆర్. సీతారామరాజు.
This website uses cookies.