Social News XYZ     

Akash’s Kottaga Vunnadu movie audio launched

ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడు!
-`కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుకలో అతిధులు 

Akash's Kottaga Vunnadu movie audio launched

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'. రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన ప్రియ, సోనియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎం.రాధా దర్శకత్వం వహించారు. యు.కె.మురళి సంగీతం సమకూర్చారు.

 

ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ఘనంగా జరిగింది. ఆడియోతోపాటు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో ఆకాష్, నిర్మాత ఎం.కె.రాజా, సంగీత దర్శకుడు  యు.కె.మురళి, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, వైకుంఠపాళి నిర్మాత జైరామ్, నటుడు-నిర్మాత దినేష్ మాడ్నే, యువ దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్ రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తి సురేష్, సుమ, లక్కీ, కొరియోగ్రాఫర్ వేణు పాల్గొన్నారు.

సినిమా టైటిల్ లానే ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడని, ఈ సినిమాతో అతనికి మళ్ళీ పెద్ద హిట్ రావాలని వేడుకలో పాల్గొన్నవారంతా ఆకాక్షించారు.

లండన్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఆంద్ర కుర్రాడిగా, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో నటించానని, విక్రమ్
అరిచితుడి తరహాలో అందర్నీ అలరిస్తుందని' ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన హీరో ఆకాష్ అన్నారు. ఆకాష్ గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని, కొత్తగా ఉన్నాడు' చిత్రానికి అన్ని పాటలు బాగా కుదిరాయని మ్యూజిక్ డైరెక్టర్ యు.కె.మురళి అన్నారు.కొత్తగా ఉన్నాడు' చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని, ఈ చిత్రంతో తనకు మంచి బోణి లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత ఎం.కె.రాజా అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్,  ఎడిటింగ్: ప్రేమ్.

Facebook Comments
Akash's Kottaga Vunnadu movie audio launched

About uma