Social News XYZ     

Sainika song from Naa Peru Surya Naa Illu India is creating sensation: Ramajogayya Sastry

అల్లు అర్జున్ స్టామినాతో "ఓ సైనిక"... పాట ప్రభంజనం సృష్టిస్తోంది  - గీత రచయిత రామజోగయ్య శాస్త్రి

Sainika song from Naa Peru Surya Naa Illu India is creating sensation: Ramajogayya Sastry

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సైనిక అనే ఫస్ట్ పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న ఈ పాట గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తమ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

 

"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ "ఓ సైనిక" అనే పాటను రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ రోజు ఉదయం అన్ని ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేశాం. పాట రిలీజ్ అయిన తర్వాత ఇది ప్రభంజనం అనే చెప్పొచ్చు.. నాకు, వక్కంతం వంశీకి, బన్నీ వాసుకు వచ్చే మెసేజ్ లు మాములుగా లేవు. పెద్ద పాట సరైన అకేషన్ లో రిలీజ్ అవ్వడం... ఆ పాటకు మాస్ బీట్ ఉన్న హీరో స్టామినా తోడైతే ఎలా ఉంటుందో అర్థమైంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సినిమా చేశారు. వారికి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్. ఈ రోజు గణతంత్ర దినోత్సవం. మన సైనికులకు పెద్ద ట్రిబ్యూట్  ఇచ్చాం అనిపించింది. ఇలాంటి పాట రాసే అవకాశం నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఒక్కో లైన్ గురించి అభిమానులు మాట్లాడుతుండడం వెరీ హ్యాపీ. మంచి పాట వస్తే మన తెలుగు వారు ఎంతలా అక్కున చేర్చుకుంటారో అర్థమైంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో గురించి చెప్పుకోవాలి... ప్రతీ లైన్ అర్థం తీసుకొని విజువల్స్ తో మేకింగ్ చేశారు వారికి హాట్సాఫ్. రియల్ లైఫ్ షాట్స్ ని పెట్టి చేసిన వీడియో అద్భుతంగా ఉంది. పాట రాసిన నాకు కళ్లనుంచి నీళ్లొచ్చాయి. అంత చక్కగా ఉంది ఈ వీడియో. ప్రమోషన్స్ లో నాంది ప్రస్తావనగా మొదలైన ఈ పాట కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబోస్ గారు మెసేజ్ పెట్టి అవార్డుల పంట పండినట్టే అన్నారు. అవార్డులు పక్కన పెడితే నాకు మార్నింగ్ నుంచి వచ్చిన మెసేజ్ ల రూపంలో అవార్డులు అందినట్టే అనిపించింది. చాలా మంది హృదయాల్ని టచ్ చేయగలిగాను. ఈ ఆల్బమ్ మొత్తం చాలా బాగా వస్తోంది. వక్కంతం వంశీ గారి కథా బలం గొప్పది. ఆయన రాసిన గత చిత్రాల మాదిరి గానే ఈ సినిమా తన దర్శకత్వంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బన్నీ గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, నాగబాబు గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Facebook Comments
Sainika song from Naa Peru Surya Naa Illu India is creating sensation: Ramajogayya Sastry

About uma