Social News XYZ     

Chethilo Cheyyesi Cheppu Bava movie launched

చేతిలోనే చెయ్యేసి చెప్పుబావా ప్రారంభం 

Chethilo Cheyyesi Cheppu Bava movie launchedఅరుణ్ రాహుల్, అంజనా జంటగా సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలో కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో కె జె రాజేష్ నిర్మిస్తున్న చిత్రం చేతిలోన చెయ్యేసి చెప్పుబావా శుక్రవారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ క్లాప్ కొట్టారు. నటులు సుమన్, భానుచందర్ దర్శకుడికి స్క్రిప్ట్ ను అందచేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో సాయి వెంకట్ మాట్లాడుతూ .. మంచి టైటిల్ పెట్టారు. తప్పకుండ మంచి ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాత కొత్తగా ఎంటర్ అవుతున్నాడు. మంచి కమిట్మెంట్ తో సినిమా తీస్తే తప్పకుండా  మంచి విజయం సాదించాలి అన్నారు.

 

పార్థ సారధి మాట్లాడుతూ .. గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేను మణిశర్మ దగ్గర చాలా సినిమాలకు పని చేశాను. ఈ కథ విన్నాను మంచి లవ్ స్టోరీ, ప్రేమ కథకు సంగీతం ప్రాముఖ్యత వహిస్తుంది. తప్పకుండ ఈ సినిమాకు మంచి సంగీతం అందిస్తాను అన్నారు.

హీరో రాజేష్ మాట్లాడుతూ .. మలయాళం, తమిళ భాషల్లో నటించిన నేను మొదటి సారి తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాహుబలి లాంటి అద్భుత చిత్రాన్ని అందించిన టాలీవుడ్ లాంటి పెద్ద పరిశ్రమలో హీరోగా నిలబడాలని ఉంది. మంచి కథతో చేస్తున్న ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ అంజనా మాట్లాడుతూ .. తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తోందన్న నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత రాజేష్ మాట్లాడుతూ .. నిర్మాతగా నా మొదటి ప్రయత్నమిది, కథ కూడా నేనే అందిస్తున్నాను. తప్పకుండా నేను మా టీమ్ కలిసి మంచి చిత్రాన్ని అందిస్తాము అన్నారు.

దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత రాజేష్ గారు మంచి కథ అందించారు .. దానికి తోడు టైటిల్ కూడా అద్భుతంగా ఉందని అందరు అంటున్నారు. ప్రేమను దక్కించుకోలేని ఓ ప్రేమ జంట మరు జన్మలో తమ ప్రేమను ఎలా దక్కించుకున్నారు .. వారి పగను ఎలా తీసుకున్నారన్న అంశాలతో తెరకెక్కనుంది. ఫిబ్రవరి చివరలో షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ వరకు పూర్తీ చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : పార్థ సారధి , కెమెరా : వేణు మురళీధరన్ వి, ఆర్ట్ : శ్రీను , కథ - నిర్మాత - కె జె రాజేష్ , డాన్స్ -  స్క్రీన్ ప్లే - డైలాగ్స్- దర్శకత్వం - కట్ల రాజేంద్ర ప్రసాద్ .

Facebook Comments
Chethilo Cheyyesi Cheppu Bava movie launched

About uma